- Home
- Entertainment
- అందమైన యాంకర్ శ్యామల ఇలా మారింది ఏంటి, బెడిసి కొట్టిన మేకప్.. నెటిజన్ దారుణమైన కామెంట్ వైరల్
అందమైన యాంకర్ శ్యామల ఇలా మారింది ఏంటి, బెడిసి కొట్టిన మేకప్.. నెటిజన్ దారుణమైన కామెంట్ వైరల్
టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది.

టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసింది.
అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయదు. నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. శ్యామల కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది.
శ్యామల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా శ్యామల షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు శ్యామల ఫొటోస్ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
శ్యామల బ్లూ ట్రాన్స్పరెంట్ శారీ, డీప్ నెక్ బ్లౌజ్ లో దర్శనం ఇచ్చింది. అయితే ఆమె ఓవర్ మేకప్ బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. దీనితో నెటిజన్లు శ్యామలని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు అయితే.. శ్యామల జబర్దస్త్ లో లేడీ గెటప్ వేస్తోందా అంటూ ఘోరంగా అవమానిస్తున్నారు.
ఈ తరహా మేకప్ ఆమెకి సెట్ కాదని సూచిస్తున్నారు. ఐబ్రోస్, లిప్స్, ముఖానికి మేకప్ పూర్తిగా వికరించినట్లు అనిపిస్తోంది. అందువల్లే యాంకర్ శ్యామల లుక్ మునుపటికంటే విభిన్నంగా ఉంటూ నెటిజన్లని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మరికొందరు మాత్రం శ్యామల తన లోని హాట్ యాంగిల్ ని బయట పెడుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. శ్యామల ఎలాంటి డ్రెస్ ధరించినప్పటికీ గ్లామర్ విషయంలో హద్దులు దాటకుండా చూసుకుంటుంది.