- Home
- Entertainment
- `జబర్దస్త్`కి యాంకర్‌గా రావడంపై రష్మి నోట్.. అంతలోనే ట్విస్ట్.. సీక్రెట్ బయటపెట్టిన హాట్ యాంకర్
`జబర్దస్త్`కి యాంకర్‌గా రావడంపై రష్మి నోట్.. అంతలోనే ట్విస్ట్.. సీక్రెట్ బయటపెట్టిన హాట్ యాంకర్
హాట్ యాంకర్ రష్మి వరుసగా కొత్త షోలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఆమెకి `జబర్దస్త్`కి హోస్ట్ గా చేసే ఛాన్స్ వచ్చిన నేపథ్యంలో ఓ నోట్‌ని పంచుకుంది రష్మి. ఇందులో అసలు సీక్రెట్ బయటపెట్టింది రష్మి.

`జబర్దస్త్`(Jabardasth) రెండు షోస్‌లుగా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. `జబర్దస్త్`కి అనసూయ(Anasuya), `ఎక్స్ ట్రా జబర్దస్త్`కి రష్మి (Rashmi) యాంకర్లుగా చేస్తున్నారు. అనసూయ మరో ఛానెల్‌లో ఆఫర్ రావడంతో `జబర్దస్త్`ని వదిలేసింది. దీంతో ఆమె స్థానంలో రష్మినే యాంకర్‌గా వచ్చింది. దీంతో ఇప్పుడు మూడు షోలతో దుమ్మురేపబోతుంది హాట్ బ్యూటీ రష్మి.
ఈ సందర్భంగా నిర్వహకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది రష్మి. `జబర్దస్త్`కి తిరిగి స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రత్యేకమైన షో చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఏం చేయడానికైనా రెడీగానే ఉంటాను. కొత్త ప్రత్యామ్నాయం వచ్చేంత వరకు హోస్ట్ గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. అప్పటి వరకు నన్ను భరించండి ప్లీజ్` అంటూ పేర్కొంది.
ఇదిలా ఉంటే అనసూయ స్థానంలో యాంకర్‌గా రష్మి గౌతమ్ రావడంతో అంతా ఖుషి అయ్యారు. ఇక రెండు `జబర్దస్త్` షోలో రష్మి రచ్చ లేపడం ఖాయమంటూ ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా హోస్ట్ గా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారానికి మూడు రోజులు రష్మి బుల్లితెరపై సందడి చేయబోతుందని ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు.
కానీ తాజాగా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది రష్మి. `జబర్దస్త్` షోకి యాంకర్‌గా తాను పూర్తి స్థాయిలో కొనసాగబోనట్టు వెల్లడించింది. తాను తాత్కాలికంగానే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. మరో ప్రత్యామ్నాయం దొరికే వరకు తాను హోస్ట్ గా చేస్తానని పేర్కొంది రష్మి. దీంతో అసలు విషయం తెలిసిందే ఆమె అభిమానులు కాస్త నిరాశలోకి వెళ్లిపోతున్నారు. అయితే దీనికి పర్మినెంట్ యాంకర్‌గా ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈవెంట్లకి యాంకర్‌గా చేస్తున్న మంజుష హోస్ట్ చేయబోతుందనే వార్తలొచ్చిన నేపథ్యంలో ఆమె వచ్చే అవకాశం ఉందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రష్మి మొదట్లో `జబర్దస్త్`కి యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే. రెండుగా విడిపోయాక `ఎక్స్ ట్రా జబర్దస్త్`కి యాంకర్‌గా చేస్తుంది రష్మి. ఈ షో కోసం ఆమె హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.
Rashmi Gautam
`ఎక్స్ ట్రా జబర్దస్త్`లో కమెడియన్ సుడిగాలిసుధీర్‌తో ప్రేమాయణం నడిపిస్తుంది రష్మి. ఇద్దరు కలిసి స్టేజ్‌పై పలికించే రొమాన్స్ ఎవర్ గ్రీన్. ఇద్దరు డ్యూయెట్లు పాడుకుంటూ షోని రక్తికట్టించారు.షోకి టీఆర్‌పీ పెంచారు. అయితే సుధీర్ `జబర్దస్త్`ని వీడాడు, `శ్రీదేవి డ్రామా కంపెనీ`ని కూడా వదిలేశాడు. దీంతో ఆయన స్థానంలో రష్మి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.