చేసేవన్నీ ల** పనులు, ఆ చీర కట్టుకుని అలా చేస్తే పాపాలు పోతాయా.. యాంకర్ రష్మీపై తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు
యాంకర్ రష్మీ గౌతమ్ తరచుగా ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. నెటిజన్లు ఆమెని ఎక్కువగానే టార్గెట్ చేస్తుంటారు. రష్మీ పాపులర్ యాంకర్ గా, నటిగా రాణిస్తోంది.
యాంకర్ రష్మీ గౌతమ్ తరచుగా ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. నెటిజన్లు ఆమెని ఎక్కువగానే టార్గెట్ చేస్తుంటారు. రష్మీ పాపులర్ యాంకర్ గా, నటిగా రాణిస్తోంది. గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మీ చాలా బోల్డ్ గా నటించి మెప్పించింది. బుల్లితెరపై కూడా సొగసు వెదజల్లుతూ కనిపిస్తూ ఉంటుంది.
రష్మీ యానిమల్ లవర్ కూడా. జంతువులకు ఎలాంటి ఆపద జరిగినా రష్మీ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పలు సందర్భాల్లో రష్మీ ట్రోలింగ్ కి గురైంది. అయితే జనవరి 22న అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తాను కూడా ఇంట్లో కాషాయ చీర ధరించి శ్రీరాముడికి పూజ చేస్తున్నట్లు రష్మీ పేర్కొంది. తనని ఎంతమంది ట్రోల్ చేసినా తాను చేసే పనులు చేస్తూనే ఉంటానని రష్మీ పేర్కొంది. జనవరి 22న రెండవ దీపావళి సెలెబ్రేట్ చేసుకోవాలని.. శ్రీరాముడు, సీతా మాత తమ ఇంటికి తిరిగి వచ్చిన శుభ సందర్భం ఇది అంటూ రష్మీ ట్వీట్ చేసింది. అప్పటి నుంచి రష్మీకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవుతూనే ఉంది.
ఒక నెటిజన్ అత్యంత తీవ్ర స్థాయిలో అసభ్యకరంగా దూషించాడు. చేసేవన్నీ లంగా పనులు.. కానీ కాషాయ చీర కట్టుకుని జై శ్రీరామ్ అంటే చేసిన అన్ని లంగా పనులు తుడిచి పెట్టుకుని పోతాయా అంటూ ఓ నెటిజన్ దారుణంగా ట్రోల్ చేశాడు. అతడికి రష్మీ గౌతమ్ అంటే ఘాటుగా బదులిచ్చింది.
నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా ? నా తల్లి దండ్రులని కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేశానా ?నేను ట్యాక్సులు కట్టడం లేదా ? నేను ఏమైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నానా ?ఒక వేళ అలాంటి పనులు చేస్తున్నట్లైతే నాపై కేసులు పెట్టండి. అసలు మీ దృష్టిలో లంగా పనులు అంటే ఏంటి ? కాషాయం చీర కట్టుకుని రామ నామ స్మరణలో ఉంటే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు ? ధర్మాన్ని, కర్మని ఆధ్యాత్మికంగా బ్యాలన్స్ చేయడమే సనాతన ధర్మం గొప్పతనం అంటూ రష్మీ కౌంటర్ ఇచ్చింది.
మరో నెటిజన్ రష్మిని ట్రోల్ చేస్తూ.. మీరు నిజంగానే సనాతన ధర్మం పాటిస్తున్నట్లు అయితే.. మీరు వెంటనే సినిమాల్లో, టివి షోలలో నటించడం మానేయాలి. అసభ్యకరమైన కంటెంట్ చూపించకూడదు. పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా ఎక్స్ ఫోజింగ్ చేయకూడదు. ఇవన్నీ ఆపేసి బెటర్ సొసైటీ కోసం ప్రయత్నించాలి అంటూ ఓ నెటిజన్ మండిపడ్డాడు.
అతడికి కూడా రష్మీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. లేదు.. నేను సినిమాలు, షోలు చేయడం మానను. మంది అభివృద్ధి చెందుతున్న కల్చర్ కామ సూత్ర పుట్టిన నేలపై మనం ఉన్నాం. మీరు మీ మైండ్ ని ఓపెన్ గా ఉంచుకుని మెట్యూరిటి సాధించండి. మన మహిళలు ఎంతో సాధించగలరు అంటూ రష్మీ పేర్కొంది.