- Home
- Entertainment
- యాంకర్ ప్రదీప్‌కి అందరి ముందు ప్రపోజ్ చేసిన మాళవిక నాయర్.. స్టేజ్‌పైనే ఎమోషనల్..
యాంకర్ ప్రదీప్‌కి అందరి ముందు ప్రపోజ్ చేసిన మాళవిక నాయర్.. స్టేజ్‌పైనే ఎమోషనల్..
యాంకర్ ప్రదీప్ టీవీ రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్నారు.ఆయన పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అయితే ఫస్ట్ టైమ్ ఆయనకు హీరోయిన్ ప్రపోజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

యాంకర్ ప్రదీప్.. మేల్ యాంకర్స్ లో అత్యంత బిజీ యాంకర్. బుల్లితెరకి ఆయనే కింగ్. `సరిగమప`, `సర్కార్` వంటి షోస్‌కి ఆయన యాంకర్‌గా చేస్తున్నారు. దాదాపు నాలుగు పదుల్లోకి అడుగుపెడుతున్నా, ఇంకా పెళ్లి ప్రస్తావనే లేదు. ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ లేదు. లవ్ ఎఫైర్ల వార్తలే లేవు. అడపాదడపా ఇలాంటి వార్తలు వినిపించినా, ఏవి ఎక్కువ రోజులు నిలవలేదు. ఆల్మోస్ట్ ప్రదీప్ సింగిల్‌గానే ఉంటున్నాడని టాక్.
ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు హీరోయిన్ ప్రపోజ్ చేసింది. `అన్ని మంచి శకునములే` చిత్రంతో రేపు(మే 18)న ఆడియెన్స్ ముందుకు రాబోతున్న హీరోయిన్ మాళవిక నాయర్.. యాంకర్ ప్రదీప్‌కి ప్రపోజ్ చేయడం విశేషం. ఎప్పుడు, ఎక్కడ అనేది చూస్తే, యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా `ఆహా`లో రన్ అవుతున్న షో `సర్కార్`. ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తుంది. దీనికి `అన్ని మంచి శకునములే` టీమ్ మెంబర్స్ దర్శకురాలు నందినిరెడ్డి, హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ హాజరయ్యారు. సినిమాని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరితో తన గేమ్ ఆడించాడు ప్రదీప్.
అయితే ఈ టీమ్ వచ్చిన ప్రారంభం నుంచి ప్రదీప్.. మాళవిక నాయర్‌పై ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చాడు. ఆమె మాట్లాడకపోతే డైరెక్టర్‌ని షాట్ చెప్పమని అడగ్గా, నువ్వే మాట్లాడటం లేదని ఆమె చెప్పడంతో సిగ్గులతో ముగ్గేశాడు ప్రదీప్. ఆడియెన్స్ ని `మీరు మిగిలిన వాళ్లతో మాట్లాడుతూ ఉండండి` అని తాను మాళవికని చూసుకుంటానని ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం, నందిని రెడ్డి.. `ప్రదీప్ నువ్వు హీరో కూడా` అని చెప్పడంతో మరింత సిగ్గులొలికించాడు ప్రదీప్. ఇది హైలైట్‌గా నిలిచింది.
ప్రదీప్ గేమ్ చూస్తుంటే, ఆగ్జైటీ లేని తనకు ఆగ్జైటీ వస్తుందని మాళవిక ముద్దు ముద్దుగా చెప్పడం విశేషం. అనంతరం మాళవిక చేత దాగుడు మూతలు ఆడిపించాడు ప్రదీప్. దీనికి నందినిరెడ్డి రియాక్ట్ అవుతూ, నాకు ఎందుకో ఈ మొత్తం ప్రొసీజర్‌లో.. ప్రదీప్‌నీకు లైన్ వేయడానికి ట్రై చేస్తున్నట్టు తనకు అనుమానంగా ఉందని చెప్పడం విశేం. అనంతరం మాళవిక ఇక ఆగలేకపోయింది. దొరికిన క్యాలీ ఫ్లవర్ తీసుకుని ప్రదీప్‌కి ప్రపోజ్ చేసింది. దీంతో ప్రదీప్ మొదట ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
అనంతరం సిగ్గులొలికించాడు. ఆమె ఇచ్చిన క్యాలీ ఫ్లవర్ తీసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇకపై తాను క్యాలీ ఫ్లవర్‌ని కూడా ఫ్లవర్ జాబితాలో చేర్చుతానని చెప్పడంలో నవ్వులు పూయించింది. మాళవిక ఇచ్చిన అందమైన ఎక్స్ ప్రెషన్స్, దానికి ప్రదీప్ రియాక్షన్ మరో హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది.