అనసూయ సక్సెస్ సీక్రెట్ తెలిసిపోయింది... ఆ వీడియోతో అసలు మేటర్ చెప్పేసింది!
అనసూయ భరద్వాజ్ కి స్టార్ హీరోయిన్స్ కి తగ్గని ఫేమ్ ఉంది. అదే స్థాయిలో ఆమె బిజీగా ఉంటారు. ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న అనసూయ... దాని వలనే మనుగడ సాగిస్తున్నా అంటూ ఓ వీడియో షేర్ చేసింది.
అనసూయ భరద్వాజ్ ఒకప్పటి జబర్దస్త్ యాంకర్. సదరు లెజెండరీ కామెడీ షో యాంకర్ గా అనసూయ సంచలనాలు చేసింది. తెలుగులో మొట్టమొదటి గ్లామరస్ యాంకర్ అంటే అనసూయ అని చెప్పొచ్చు. గతంలో అనసూయ మాదిరి స్కిన్ షో చేసిన యాంకర్స్ లేరు. అనసూయ స్ఫూర్తితో రష్మి గౌతమ్, శ్రీముఖి, వర్షిణి... ఇలా పలువురు యంగ్ యాంకర్స్ గ్లామరస్ యాంకర్స్ గా ఎదిగారు.
Anasuya bharadwaj
యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటిగా కొనసాగుతుంది. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. మరోవైపు ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ. అనసూయ ఆదాయం లక్షల నుండి కోట్లకు చేరింది. ప్రొఫెషన్ లో ఎంత బిజీగా ఉన్నా... అనసూయ కుటుంబానికి సమయం కేటాయిస్తుంది. పిల్లలు, భర్త పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి స్పెషల్ డేస్ ప్రత్యేకంగా జరుపుకుంటుంది.
విరామం దొరికితే పిల్లలతో వెకేషన్ కి వెళుతుంది. ప్రస్తుతం అనసూయ వెకేషన్ లోనే ఉంది. ఓ సాగరతీరంలో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో అనసూయ షేర్ చేసిన వీడియో అందరినీ ఆకర్షించింది. ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ మూమెంట్స్ కెమెరాలో బంధించిన అనసూయ... అందమైన సాంగ్ జోడించి వీడియో క్రియేట్ చేసింది.
సదరు వీడియోకి ''కుటుంబ సభ్యులకు ప్రేమ ఇవ్వడం పొందడం ద్వారా నేను మనుగడ సాగించగలుగుతున్నాను'' అని క్యాప్షన్ పెట్టింది. తన ఉన్నతికి, సక్సెస్ కి కుటుంబమే కారణమని అనసూయ చెప్పకనే చెప్పింది. అనసూయ భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. వీరిది ప్రేమ వివాహం. ఇద్దరు అబ్బాయిలు సంతానంగా ఉన్నారు.
అనసూయ కుటుంబ సభ్యులతో గడిపేందుకు చాలా ఇష్టపడతారు. అనసూయ నటిగా కూడా సక్సెస్. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. నెక్స్ట్ అనసూయ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2లో కనిపించనుంది.