- Home
- Entertainment
- Anasuya Bharadwaj : అనసూయపై అలిగిన అభిమాని.. అతని కోరిక తీర్చబోతున్న రంగమ్మత్త.. ఎప్పుడంటే?
Anasuya Bharadwaj : అనసూయపై అలిగిన అభిమాని.. అతని కోరిక తీర్చబోతున్న రంగమ్మత్త.. ఎప్పుడంటే?
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తన అభిమానికి ఆసక్తికరంగా రిప్లై ఇచ్చింది. ఈనెల తప్పకుండా కలుద్దామంటూ డేట్ కూడా ఫిక్స్ చేసింది. ఇంతకీ ఎందుకంటే.!

‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షోతో అనసూయ భరద్వాజ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. స్టార్ యాంకర్ గా బుల్లితెరపై అనసూయ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదనే చెప్పాలి.
యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం నటిగా వెండితెరపై అలరిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది.
ఈ క్రమంలోనే అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై దూరమైనప్పటికీ తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది.
మరోవైపు అనసూయ నటిగా అవకాశాలు అందుకోవడంతో పాటు తరుచుగా ఆయా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు హాజరవుతూ సందడి చేస్తోంది. ఈ రకంగా తన అభిమానులనూ డైరెక్ట్ గా కలుస్తోంది.
అయితే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు తమను హార్ట్ చేస్తున్నావంటూ ఓ అభిమాని అనసూయను ప్రశ్నించాడు. దానికి రంగమ్మత్త రిప్లై ఇచ్చింది. ఓపెనింగ్ కార్యక్రమాల్లో సెల్పీలు, అదీఇదీ అంటారుగానీ.. కనీసం మావైపు కూడా చూడరు అని తన మనసులోని మాటలను చెప్పారు. ఈసారైనా కుదురుతుందా అని అడిగాడు.
దీనికి అనసూయ స్పందించింది. ‘ఎంత మాటా.. తెలియకుండా జరిగిపోతుందేమో కానీ తెలిసి అస్సలు కాదండి. ఈ సారి కచ్చితంగా మనం కలిసి సెల్ఫీ దిగుదాం’ అంటూ అభిమానికి రిప్లై ఇచ్చింది. నెక్ట్స్ మార్చి 15న నిర్వహించే కార్యక్రమంలో సెల్ఫీ ఇవ్వబోతున్నట్టు రిప్లై లో తెలిపింది.