- Home
- Entertainment
- Anasuya: రమ్యకృష్ణ, నగ్మ, రంభ భయపడ్డారేమో.. వామ్మో రాఘవేంద్ర రావు తీరని కోరికకు అనసూయ సై..
Anasuya: రమ్యకృష్ణ, నగ్మ, రంభ భయపడ్డారేమో.. వామ్మో రాఘవేంద్ర రావు తీరని కోరికకు అనసూయ సై..
ప్రస్తుతం రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న 'పండుగాడ్' చిత్రంతో ఆయన కోరిక తీరబోతున్నట్లు తెలుస్తోంది.

రాఘవేంద్ర రావు చిత్రాల్లో బలమైన కథ కథనాలు ఉంటాయి. అందుకే ఆయన 100కి పైగా చిత్రాలు తెరకెక్కించినా ఇప్పటికీ రాణిస్తున్నారు. తెలుగు కమర్షియల్ చిత్రాలకు రాఘవేంద్ర రావు మార్గదర్శకం అనే చెప్పాలి. రాఘవేంద్ర రావు ఎన్నో జోనర్స్ లో సినిమాలు చేశారు. జానపద చిత్రాలు, మాస్ చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు, భక్తి రస చిత్రాలు ఇలా చాలా జోనర్స్ లో రాఘవేంద్ర రావు నుంచి బ్లాక్ బస్టర్ మూవీస్ చూశాం.
కానీ రాఘవేంద్ర రావు ఏ సినిమా తీసినా అందులో శృంగార రసం తప్పకుండా ఉంటుంది. హీరోయిన్లని అందంగా ఎలా ప్రజెంట్ చేయాలో రాఘవేంద్ర రావుకి తెలిసినంతగా మరెవరికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. పాటల చిత్రీకరణలో రాఘవేంద్ర రావుకి ప్రత్యేకమైన శైలి ఉంది. హీరోయిన్ల నాభి అందాలు హైలైట్ చేస్తారు.
కథానాయికల నాభిపై పూలు, పళ్ళు వేయడం రాఘవేంద్ర రావు స్టైల్. మహిళల్లో అందంగా కనిపించేది నడుమే.. అందుకే అలా చేస్తాను అని రాఘవేంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. 90వ దశకంలో రాఘవేంద్ర రావు చిత్రాల్లోని ఈ తరహా పాటలు బాగా అలరించాయి. రంభ, నగ్మ, రమ్య కృష్ణ, దీప్తి భట్నాగర్ వీరితో పాటు దర్శకేంద్రుడి చిత్రాల్లో నటించిన ఇతర హీరోయిన్లపై కూడా పూలు, పళ్లతో ప్రయోగం చేశారు.
నాభిపై జామకాయలు, యాపిల్స్ , ద్రాక్ష లాంటి పళ్ళు వేయడం చూసాం. ఓ ఈవెంట్ లో కమెడియన్ అలీ.. రాఘవేంద్ర రావు గురించి సరదాగా మాట్లాడుతూ.. మీరు యాపిల్, జామకాయ ఇలా అన్ని పళ్ళని వాడేశారు. పుచ్చకాయని ఎప్పుడు వాడుతున్నారు అని ప్రశ్నించగా.. ఆయన నవ్వేసి ఊరుకున్నారు. బహుశా రాఘవేంద్ర రావుకి అది తీరని కోరిక ఏమో.. ఇప్పుడు ఆ కోరికని కూడా తీర్చుకునేందుకు రాఘవేంద్ర రావు రెడీ అయ్యారు.
అప్పటి హీరోయిన్లు మరీ పుచ్చకాయని తమ నడుముపై వేసుకోవడానికి భయపడ్డట్లు ఉన్నారు. అందుకే అది రాఘవేంద్ర రావుకి తీరని కోరికలా మిగిలిపోయింది. ప్రస్తుతం రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న 'పండుగాడ్' చిత్రంతో ఆయన కోరిక తీరబోతున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా ఈ చిత్ర టీజర్ విడుదలయింది. ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, సునీల్, దీపికా పిల్లి, అనసూయ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ లో అనసూయ పొట్టి బట్టల్లో నాభి అందాలు ఆరబోస్తూ చేతిలో పుచ్చకాయ పట్టుకుని షాకిచ్చింది. పుచ్చకాయతో అనసూయ వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది.
దీనితో రాఘవేంద్ర రావు కోరిక అనసూయ రూపంలో తీరుతోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పుచ్చకాయతో సాంగ్ చేయడానికి రంభ, నగ్మా, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లు భయపడ్డారేమో.. కానీ అనసూయ సై అంటోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుచ్చకాయతో మాత్రమేనా.. లేక ఇతర పళ్లతో కూడా అనసూయ ఈ చిత్రంలో కనిపిస్తుందా అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. రాఘవేంద్ర రావు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రానికి శ్రీధర సీపాన దర్శకుడు.