విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమాపై అనసూయ ట్వీట్... వాళ్ళ కథలా ఉందంటూ!
హీరో విజయ్ దేవరకొండ అంటే మండిపడే అనసూయ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ చిత్రం గురించి స్పందించారు. ఓ ట్వీట్ వేశారు

లైగర్ మూవీ విడుదల నాటి నుండి అనసూయ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి సోషల్ మీడియా వార్ నడిచింది. ఇక విజయ్ దేవరకొండను కావాలనే టార్గెట్ చేసినట్లు ఇటీవల అనసూయ ఓపెన్ అయ్యారు. అలాంటి అనసూయ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ చిత్రానికి మద్దతుగా నిలిచింది.
Anasuya Bharadwaj
తాజాగా బేబీ చిత్ర ట్రైలర్ విడులైంది. ఆ ట్రైలర్ పై అనసూయ పాజిటివ్ కామెంట్స్ చేసింది. 'కొంచెం లేటుగా స్పందించాను, పర్లేదు. ట్రైలర్ మనసుకు హత్తుకుంది. డైలాగ్స్, ఒరిజినాలిటీ కదిలించాయి. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. నాకు తెలిసిన వాళ్ళ కథలానే ఉంది', అంటూ ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండతో వివాదం నేపథ్యంలో తమ్ముడు సినిమాపై అనసూయ పాజిటివ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా విజయ్ దేవరకొండ వద్ద పని చేసే ఓ వ్యక్తి డబ్బులిచ్చి తనపై దుష్ప్రచారం చేయించాడని అనసూయ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. విజయ్ కి తెలియకుండా ఆ వ్యక్తి నన్ను టార్గెట్ చేస్తాడని నేను అనుకోను. ఆ విషయం తెలిశాక నేను చాలా బాధపడ్డానని అనసూయ అన్నారు.
ఒకప్పుడు నేను, విజయ్ దేవరకొండ మిత్రులం. ఆయన నిర్మించిన మీకు మాత్రమే చెప్తా మూవీలో నాకు రోల్ ఆఫర్ చేశారు. విజయ్ దేవరకొండకు నాపై ద్వేషం ఉందో లేదో నాకు తెలియదు. ఇకపై ఈ వివాదాన్ని పొడిగించకూడదు అనుకుంటున్నాను. ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నానని అనసూయ అన్నారు.
విజయ్ దేవరకొండను ఇకను టార్గెట్ చేయను. మా వివాదం ముగిసిందని అనసూయ అన్నారు. ప్రశాంత కోసమే ఈ నిర్ణయమని ఆమె వెల్లడించారు. అది నిరూపించుకొనేందుకే ఆనంద్ దేవరకొండ సినిమాను ప్రమోట్ చేస్తూ పాజిటివ్ కామెంట్స్ చేశారనిపిస్తుంది.
ఇక అనసూయ నటిగా బిజీగా ఉన్నారు. పుష్ప 2తో పాటు పలు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. అనసూయ నటించిన రంగమార్తాండ, విమానం నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. విమానం ఓటీటీలో ఆదరణ దక్కించుకుంటుంది. ఈ చిత్రంలో అనసూయ వేశ్య పాత్ర చేసిన విషయం తెలిసిందే...