- Home
- Entertainment
- స్లిమ్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ.. చీరలో ఆమె ఇచ్చిన పోజులకు పిచ్చెక్కిపోవాల్సిందే..
స్లిమ్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ.. చీరలో ఆమె ఇచ్చిన పోజులకు పిచ్చెక్కిపోవాల్సిందే..
మాజీ యాంకర్ అనసూయ జబర్దస్త్ షో మానేసి సినిమాలకే పరిమితమయ్యింది. దీంతో ఆమె గ్లామర్ ట్రీట్‌కి అభిమానులు నోచుకోవడం లేదు. కానీ ఇప్పుడు మరో రూపంలో సర్‌ప్రైజ్ చేసింది.

యాంకర్ అనసూయ వెండితెరపై బిజీగా ఉంది. ఆమె సినిమాలకే మెయిన్‌గా ప్రయారిటీ ఇస్తుంది. టీవీ షోలో తనపై వచ్చే కామెంట్లని భరించ లేక, బాడీ షేమింగ్ కామెంట్లని ఫేస్ చేయలేక తాను తప్పుకుంటున్నట్టు తెలిపింది. తన పిల్లలు పెద్దవాళ్లు అవుతున్న నేపథ్యంలో టీవీ షోస్‌లో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్‌ల కారణంగా తాను షో నుంచి తప్పుకున్నట్టు చెప్పింది.
దీంతో ఇప్పుడు అనసూయ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. బిగ్ స్క్రీన్‌పై రచ్చ చేస్తుంది. బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. అందంతో కాదు, నటనతో మెప్పిస్తా అని నిరూపిస్తుంది. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు కూడా అలానే ఉండటం విశేషం.
దీని కారణంగా సోషల్ మీడియాలో అభిమానులు హర్ట్ అయిపోతున్నారు. అనసూయ అందాల విందు లేక తళ్లడిల్లిపోతున్నారు. గ్లామర్ ట్రీట్ కోసం అర్రులు చాస్తున్నారు. వారికోసం అడపాదడపా ఫోటో షూట్ చేస్తూ ఫోటోలను పంచుకుంటుంది అనసూయ. వారిని ఖుషీ చేసే ప్రయత్నం చేస్తుంది.
మరోవైపు సినిమా ఈవెంట్లలో పాల్గొంటూ మెప్పిస్తుంది. తనదైన విజువల్ ట్రీట్ ఇస్తుంది. అందాల ఆరబోతతో వారిని ఆకర్షిస్తుంది. తాజాగా మరోసారి ఆమె అందాల విందుతో మెరిసింది. చీరలో తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది.
నిన్న సోమవారం `రజాకార్` సినిమా ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంది అనసూయ. చీరలో మెరిసింది. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అదిరిపోయే పోస్ట్ పెట్టింది.
`నేను భర్తీ చేయగలనని తెలుసుకోగలిగేంత వినయం, కానీ నాలాగా మరెవరూ లేరని తెలుసుకునేంత తెలివైనదాన్ని` అని పేర్కొంది. మొత్తంగా తనలా ఎవరూ లేరని చెప్పింది అనసూయ. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చే చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇందులో చాలా స్లిమ్ లుక్‌లో కనిపిస్తుంది అనసూయ. ఊహించనంత సన్నగా మారిపోయింది. కుర్రాళ్లని మరింత ఫిదా చేస్తుంది. గతంలో ఆంటీ అంటూ ఆమెని ర్యాగింగ్ చేశారు. దానికి కౌంటర్లు ఇవ్వడంతో పెద్ద రచ్చ అయ్యింది. కానీ ఇప్పుడు రియల్‌గా స్లిమ్‌గా మారి షాకిస్తుందీ హాట్ యాంకర్.
ఇక ప్రస్తుతం అనసూయ `రజాకార్` చిత్రంతోపాటు `పుష్ప`, `సింబా`, తమిళంలో ఓ సినిమా చేస్తుంది. మరికొన్ని ప్రకటించని మూవీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. బలమైన పాత్రలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. నటిగా తానేంటో నిరూపించుకుంటుంది అనసూయ.