జబర్దస్త్ ని వదిలేసి అనసూయ తప్పు చేసిందా?.. సోషల్ మీడియాలో రచ్చ..
తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో ఉర్రూతలూగించింది అనసూయ. హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు ఒక్క షో కూడా లేదు. దీంతో బుల్లితెరపై కనిపించకుండా పోయింది.

హాట్ యాంకర్‌గా, రంగమ్మత్తగా పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ(Anasuya)కి లైఫ్ ఇచ్చింది `జబర్దస్త్`(Jabardasth) కామెడీ షో. ఇదే అనసూయ అంటే ఎవరో అటు బుల్లితెరకి, ఇటు పెద్ద తెరకి, సాధారణ ఆడియెన్స్ కి తెలిసేలా చేసింది. అంతకు ముందు ఆమె పలు చిత్రాల్లో నటించినా, కనీస గుర్తింపు కూడా లేదు. `జబర్దస్త్`లో పొట్టిదుస్తుల్లో, చిలిపి అల్లరితో ఆకట్టుకుంటూ క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
మరోవైపు వరుసగా ఫోటో షూట్లతోనూ విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకుంది. వారం వారం అందాల డోస్ పెంచుతూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీని పెంచుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. దీంతో ఈ బ్యూటీ ఫోటోలంటే పడి చచ్చే అభిమానులు తయారయ్యారు. అదే సమయంలో అనసూయ యాటిట్యూడ్, గ్లామర్ ఫోటోలు కొన్నిసార్లు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.
Anasuya Bharadwaj
ఇటీవల అనసూయ సినిమాల్లోనూ బిజీ అయ్యింది. అంతకు ముందు అడపాదడపా సినిమాలు చేసే అనసూయకి `రంగస్థలం`లోని రంగమ్మత్త పాత్రతో ఆకట్టుకుంది. బిజీ నటిగా మారిపోయింది. అయితే ఈ అవకాశం రావడం వెనకాల `జబర్దస్త్` ప్రభావం ఉందనిచెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత వరుసగా ఆమెకి సినిమా ఛాన్స్ లు క్యూ కట్టడంలోనూ దీని పాత్ర చాలా కీలకంగా మారింది. కానీ ఊహించిన విధంగా ఇటీవల `జబర్దస్త్`ని వీడింది అనసూయ.
Anasuya Bharadwaj
`జబర్దస్త్`ని వీడటమే కాదు, దీనిపై పలు ఆరోపణలు చేసింది. తన మనసుని చంపుకుని చేయాల్సి వస్తుందని, బాడీ షేమింగ్ కామెంట్లని భరించాల్సి వస్తుందని ఆరోపించింది. ఒకప్పుడు బూతు షోగా అనేక విమర్శలు రాగా, దాన్ని ఆమె ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు అదే విమర్శలు అనసూయ చేయడంతో అంతా షాక్‌అయ్యారు. రెమ్యూనరేషన్ విషయంలో తాను అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఎక్కువ పారితోషికం ఎక్కువ కోసం ఆమె ఈ షోని వదిలేసిందనే టాక్ కూడా వినిపించింది.
Anasuya Bharadwaj
ఈ షోకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆమె స్టార్ మాలో `సూపర్ సింగర్ జూనియర్` షోకి యాంకరింగ్ చేసింది. సుడిగాలి సుధీర్‌లతో కలిసి ఈ షోకి యాంకరింగ్ చేశారు. దీనికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాలా మందికి ఇదొక షో ఉందా అనేది తెలిసే లోపే సీజన్ అయిపోవడం గమనార్హం. ఇటీవల నాగార్జున గెస్ట్ గా గ్రాండ్ ఫినాలే పూర్తయ్యింది. ప్రస్తుతానికి అనసూయ చేతిలో ఒక్క షో కూడా లేదు. ఇప్పట్లో ఆమెకి వచ్చే సూచనలుకూడా కనిపించడం లేదు. ఇది ఆమె కెరీర్‌పై కొంత ప్రభావం చూపిస్తుందనే టాక్ వినిపిస్తుంది.
Sowmya Rao
ఇదిలా ఉంటే అనసూయ `జబర్దస్త్`ని వీడిన తర్వాత ఆమె స్థానంలో రష్మి యాంకరింగ్ చేసింది. రష్మి రెండు జబర్దస్త్ షోలకు యాంకరింగ్ చేస్తూ మరింత పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఆమె స్థానంలో మరో కొత్త యాంకర్ వచ్చింది. కన్నడ నటి, యాంకర్ సౌమ్య రావుని తీసుకొచ్చింది మల్లెమాల టీమ్. వచ్చి రావడంతోనే చర్చల్లో నిలిచింది సౌమ్యరావు. అందరిని ఆకట్టుకుంది. ఆమె యాంకర్‌గా చేసే మొదటి షో ఈ గురువారం ప్రసారం కానుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ ఓ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుందనే కామెంట్లు వస్తున్నాయి. అయితే ఏ షో చేయాలి, ఏ షో చేయకూడదనేది పూర్తి అది వారి వ్యక్తిగతం. అందులో ఎవరూ కామెంట్ చేయడానికి లేదు. కానీ ఆమె చేసిన పొరపాటు వల్ల చాలా మిస్ అవుతుందనే అభిప్రాయం అభిమానులు, నెటిజన్ల నుంచి వినిపిస్తుంది. `జబర్దస్త్`తో ఇన్నాళ్లు ఆ క్రేజ్‌ని, పాపులారిటీ సొంతం చేసుకున్న అనసూయ ఆ క్రేజ్‌కి దూరమవుతుందనే అభిప్రాయం వినిపిస్తుంది.
ప్రతి గురువారం ఆమె పంచుకునే ఫోటో షూట్లు, టీవీలో ఆమె చేసే రచ్చ సందడిగా ఉండేది. వీటి కారణంగానే ఆమెకి ఇతర అవకాశాలు వచ్చేవి. సినిమా ఛాన్స్ లు మాత్రమే కాదు, వీటి ద్వారా సోషల్ మీడియా యాడ్స్, షాప్ ఓపెనింగ్ వంటి అనేక అవకాశాలు, ప్రయోజనాలు ఆమెకి వరించేవి. కానీ ఇప్పుడు అవి క్రమంగా తగ్గిపోతున్నాయనే అభిప్రాయం నెట్టింట వినిపిస్తుంది. దీనికి ఆమె తొందరపాటే కారణమని అంటున్నారు. మరి ఈ విషయంలో అనసూయ ఫీలింగ్ ఏంటో చూడాలి.