- Home
- Entertainment
- లెహంగా వోణీలో మైమరిపించేలా అనసూయ సింగారం.. అన్ని యాంగిల్లో అందాలు ఆరబోసిన బుల్లితెర బ్యూటీ..
లెహంగా వోణీలో మైమరిపించేలా అనసూయ సింగారం.. అన్ని యాంగిల్లో అందాలు ఆరబోసిన బుల్లితెర బ్యూటీ..
అందాల యాంకర్ అనసూయ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. లెహంగా వోణీలో అందాలను ఆరబోస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. లేటెస్ట్ గా రంగమ్మత్త చేసిన ఫొటోషూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ (Anchor Anasuya)కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై అందాలు ఆరబోస్తూనే.. ఇటు విభిన్న పాత్రల్లో వెండితెరపై తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు పెంచింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘రంగస్థలం’తో రంగమ్మత్తగా నటించింది అనసూయ. గ్రామీణ మహిళగా చక్కగా నటించింది. అప్పటి నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చిత్రంలోనూ మంగళం శ్రీను భార్యగా దాక్షాయణి పాత్రలో నటించింది. ఈ పాత్రతో ఇక అనసూయ పాపులారిటీ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది. అదే జోష్ తో ఆమె వరుస సినిమాలను ప్రకటిస్తూ షాకిస్తోంది. మున్ముందు కూడా ఈ బ్యూటీ ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపించేలా ప్లాన్ చేసుకుంది.
అటు ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో యాంకర్ గా కొనసాగుతూనే.. ఇటు సూపర్ సింగర్ జూనియర్ (Super Singer Junior)లో యాంకర్ సుధీర్ తో కలిసి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ సింగింగ్ రియాలిటీ షోకు జడ్జీగా కేఎస్ సుచిత్ర, హేమచంద్ర, సింగర్ మనో, రనిన రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కానుంది.
ఈ షోకోసం అనసూయ ట్రెడిషనల్ గా రెడీ అయ్యింది. ఈ సందర్భంగా అందాల యాంకర్ తన ఒంపుసొంపులనూ చూపిస్తూ మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. ఆకట్టుకునే అందంతో అదిరిపోయే స్టిల్స్ తో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పిక్స్ లో గ్రీన్, వయోలెట్ కలర్ లెహంగా వోణీలో దర్శనమిచ్చింది. అచ్చమైన పల్లెటూరి పడుచులా ఆకట్టుకుంటోంది. అందాలను విందు చేస్తూ మతిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చిందీ బ్యూటీ. యాంకర్ గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఫొటోలను లైక్ కొడుతూ.. కామెంట్లు పెడుతున్నారు.
‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షలకులతో ఒకే అనిపించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోంది. ‘దర్జా, వాంటెండ్ పండుగాడ్, సింబా, పుష్ఫ : ది రూల్, రంగ మార్తండా’ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.