అనసూయ తన భర్తకి చిలిపి ముద్దు.. బదులుగా కన్నుకొట్టిన సుశాంక్.. హాట్ యాంకర్ రచ్చ మామూలుగా లేదుగా
అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. తనకు సంబంధించిన అన్నింటిని పంచుకుంటుంది. ఫ్యామిలీతో సరదా సమయాన్ని కూడా ఆమె షేర్ చేస్తుంది. ఇప్పుడు అదే చేసింది. కానీ చాలా స్పెషల్.
హాట్ యాంకర్ అనసూయ(Anasuya).. యాంకరింగ్ వదిలేసి సినిమాలపై ఫోకస్ పెట్టింది. బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. ఇకపై వెండితెరపైనే మెప్పిస్తానని చెబుతుంది. గ్లామర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం చేసి, పర్‌ఫెర్మెన్స్ తో ఆడియెన్స్ ని అలరిస్తానని చెబుతుంది. అలాంటి బలమైన పాత్రలతోనే మెప్పిస్తుంది.
తాజాగా ఈ హాట్ బ్యూటీ తన భర్తతో కూడిన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆయనతో రెస్టారెంట్‌లో సరదాగా గడిపిన ఫోటోలను షేర్ చేసుకుంది. కారణం.. అనసూయ భర్త సుశాంత్ భరద్వాజ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డేని స్పెషల్‌గా మార్చింది.
ఫ్యామిలీ సమక్షంలో కేక్ కట్ చేయించింది అనసూయ. ఫ్యామిలీ, పిల్లలతో కలిసి ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోల్లో చిలిపిగా, కొంటెగా ఉండటం విశేషం. అవి నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
అనసూయ ఇందులో తన భర్తకి దొంగ ముద్దు పెడుతుంది. అది అదిరిపోయేలా ఉంది. దీనికి భర్త సుశాంత్ ఇచ్చిన రియాక్షన్ క్రేజీగా ఉంది. అనసూయ ముద్దుకి బదులుగా ఆయన కన్నుగీటుతూ పోజులివ్వడం విశేషం.
ఈ సందర్భంగా అనసూయ భర్తతో కలిసి చిలిపిగా పోజులిచ్చింది. ఆ బర్త్ డే స్పెషల్ వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా అనసూయ ఓ నోట్‌ని పంచుకుంటూ తన భర్తకి బర్త్ డే విషెస్ తెలిపింది.
`ఈ ప్రపంచానికి నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి తమ్ముడు, నీలాంటి భర్త, నీలాంటి అల్లుడు, నీలాంటి తండ్రి, ఈ ప్రపంచానికి నీ లాంటి మనుషులు కావాలి. నా విషయంలో అది నువ్వు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ధన్యవాదాలు. నన్ను నేనుగా ఉండనివ్వండి అంటూ బర్త్ డే విషెస్ తెలిపింది అనసూయ.
అనసూయ టీవీ షోస్‌కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. యాంకరింగ్‌ని తాను వదిలేస్తున్నట్టు తెలిపింది. అయితే ఎగ్జైటింగ్‌గా ఉండే షోస్ వస్తే చేస్తానని ఇటీవలే తెలిపింది. కానీ అప్పటి వరకు దానికి జోలికి వెళ్లదలుచుకోలేదని తెలిపింది.
ఇక సినిమాలతో బిజీగా ఉంది అనసూయ. ఇటీవలే `పెదకాపు` చిత్రంతో వచ్చింది. ఇందులో అక్కమ్మ పాత్రలో అదరగొట్టింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా, చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. అందరిని ఆకట్టుకుంది.
దీంతోపాటు ఇప్పుడు `పుష్ప2`లో నటిస్తుంది. అలాగే `పెదకాపు 2`తోనూ రానుంది. మరోవైపు `ప్రేమ విమానం` అనే ఓటీటీ ఫిల్మ్ చేసింది. తమిళంలో ఓ చిత్రంలో నటిస్తుంది. `సింబా` అనే మరో మూవీ చేస్తుంది. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది అనసూయ.