అనసూయ బుల్లితెర రీఎంట్రీ.. హింట్ ఇచ్చిన జబర్దస్త్ మాజీ యాంకర్..
అనసూయ `జబర్దస్త్` కామెడీ షోతో పాపులర్ అయ్యింది. స్టార్ యాంకర్ అయ్యింది. కానీ దానిపైనే విమర్శలు చేసి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై రచ్చ చేసేందుకు వస్తుందట.
అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj).. న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారింది. అట్నుంచి బుల్లితెర యాంకర్‌గా టర్న్ తీసుకుంది. `జబర్దస్త్` (Jabardasth) కామెడీ షో ఈ బ్యూటీకి లైఫ్ ఇచ్చింది. ఇందులో అందాల విందు చేస్తూ, కవ్వింపు చర్యలు చేపడుతూ చలాకీతనంతో ఆకట్టుకుంది. బాగా పాపులర్ అయ్యింది. స్టార్ యాంకర్‌గా రాణించింది. ఇది ఆమె సిల్వర్ స్క్రీన్ అవకాశాలను తెచ్చిపెట్టింది.
Anasuya Bharadwaj
`రంగస్థలం`లో రంగమ్మత్త పాత్ర సినిమా కెరీర్‌కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికీ అనసూయని రంగమ్మత్తగానే పిలుస్తుంటారు. ఆ తర్వాత దాన్ని మించిన పాత్ర ఆమెకి పడలేదు. బుల్లితెరపై గ్లామర్ ట్రీట్ ఇచ్చే అనసూయ పెద్ద తెరపై మాత్రం డీ గ్లామర్‌కే ప్రయారిటీ ఇస్తుంది. ఇటీవల ఆమె చాలా వరకు డీ గ్లామర్ రోల్స్ చేస్తుండటం విశేషం. `పుష్ప`, `విమానం`, `ప్రేమ విమానం` చిత్రాల్లో ఆమె పాత్రలు అలానే ఉంటాయి. వెండితెరపై బిజీగా ఉన్న అనసూయ.. ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై ఫోకస్ పెడుతుంది.
అనసూయ `జబర్దస్త్` మానేయడంతో ఆమె ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు. ఆమెని చాలా మిస్ అవుతున్నారు. మళ్లీ కమ్ బ్యాక్ అంటూ చాలా కాలంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎట్టకేలకు ఈ హాట్ యాంకర్ రీఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుందట. ఇటీవల ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పింది. ఓ టీవీ ఛానెల్‌లో స్పెషల్ షోతో సందడి చేయబోతున్నట్టు చెప్పింది.
తాజాగా హింట్ ఇచ్చిందీ అందాల మాజీ యాంకర్. తాను టీవీ (Anasuya Tv Show) లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారా? అని పోల్ నిర్వహించింది అనసూయ. దీనికి 82 శాతం రావాలని కోరుకుంటున్నారు. దీనికి అనసూయ `వాహ్` అంటూ రియాక్ట్ అయ్యింది. మరి ఏ షో చేయాలని పోల్ నిర్వహించగా, అంతా `జబర్దస్త్` అని చెప్పారు. అయితే దీనిపై అనసూయ ఆలోచిస్తున్నట్టు ఎమోజీలను పోస్ట్ చేసింది.
అయితే ఆమె స్టార్ మా కోసం ఓ షో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ స్పెషల్ షోని ప్లాన్ చేసినట్టు సమాచారం. దానికి సంబంధించిన అప్‌డేట్ ఈ భామ త్వరలోనే ఇవ్వబోతుందని తెలుస్తుంది. అంతేకాదు బుల్లితెరపై మళ్లీ సందడి చేసేందుకు ఆమె రెడీ అవుతుందట. అయితే ఏ షో, ఎప్పుడు వస్తుందనేదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.