బీచ్ లో అనసూయ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. 2025కి వెల్కమ్ చెబుతూ ఇలా, వైరల్ ఫొటోస్
అనసూయ భరద్వాజ్ గత కొన్నేళ్లుగా నటిగా దూసుకుపోతోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాల్లో అనసూయ పోషించిన పాత్రలకు ప్రశంసలు దక్కాయి.
అనసూయ భరద్వాజ్ గత కొన్నేళ్లుగా నటిగా దూసుకుపోతోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాల్లో అనసూయ పోషించిన పాత్రలకు ప్రశంసలు దక్కాయి. 2024లో కూడా అనసూయ కొన్ని క్రేజీ చిత్రాల్లో నటించింది. 2025లో నటిగా మరిన్ని ప్రయోగాలు చేయాలని అనసూయ భావిస్తోంది.
2024 కి గుడ్ బై చెప్పేసిన అనసూయ.. 2025 న్యూ ఇయర్ వేడుకల్ని చాలా గ్రాండ్ గా తన ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకుంది. అనసూయ తన ఫ్యామిలీతో బీచ్ లో 31 నైట్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని పోస్ట్ చేసింది. అభిమానులతో అనసూయ చాలా రోజుల తర్వాత గ్లామరస్ ఫొటోస్ షేర్ చేసుకుంది.
ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ ఇలా పోస్ట్ చేసింది. '2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత ఏడాది కాస్త కష్టంగా సాగింది అనే విషయం నాకు తెలుసు. కానీ ప్రతి ముగింపు కొత్త ప్రారంభానికి కారణం అవుతుంది. ప్రతి సూర్యోదయం కొత్త అవకాశాలని తీసుకువస్తుంది. ఇప్పుడు మనకి 365 అవకాశాలు ఉన్నాయి అంటూ అనసూయ పోస్ట్ చేసింది.
సింపుల్ గా ఉన్న అవుట్ ఫిట్ లో అనసూయ మేకప్ లేకుండా బీచ్ లో ఫోజులు ఇచ్చింది. అనసూయ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనసూయ చివరగా పుష్ప 2 లో నటించింది. ప్రస్తుతం ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా అనసూయ.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది.