- Home
- Entertainment
- Anasuya: టైట్ టీ షర్ట్ లో ఆకాశానికి హగ్ ఇస్తున్నట్లు.. సముద్రపు ఒడ్డున అనసూయ మైండ్ బ్లోయింగ్ షో
Anasuya: టైట్ టీ షర్ట్ లో ఆకాశానికి హగ్ ఇస్తున్నట్లు.. సముద్రపు ఒడ్డున అనసూయ మైండ్ బ్లోయింగ్ షో
అనసూయ యాంకర్ గా ఎంత పాపులర్ అయిందో ప్రస్తుతం నటిగా కూడా అలాగే రాణిస్తోంది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

అనసూయ యాంకర్ గా ఎంత పాపులర్ అయిందో ప్రస్తుతం నటిగా కూడా అలాగే రాణిస్తోంది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.
పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు.
కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని అనసూయ అభిమానులతో పంచుకుంది.
పొట్టి నిక్కర్, అందాలని హత్తుకున్నట్లుగా ఉన్న టైట్ టీ షర్ట్ లో అనసూయ సముద్రపు ఒడ్డున మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. తన హాట్ స్ట్రక్చర్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.
ఇదిలా ఉండగా అనసూయ రీసెంట్ గా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాలపై ఫోకస్ పెట్టేందుకు.. ఇతర షోలకి సమయం కేటాయించేందుకు అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.