- Home
- Entertainment
- ఏపీలో వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు డ్యూటీ చేసిన రోజు .. 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ పై అనన్య పోస్ట్
ఏపీలో వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు డ్యూటీ చేసిన రోజు .. 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ పై అనన్య పోస్ట్
పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ చిత్రం ఒక రీ ఎంట్రీ లాంటి మూవీ అని చెప్పాలి. అజ్ఞాతవాసి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పవన్ పింక్ రీమేక్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. 2021లో ఈ చిత్రం రిలీజై ఘనవిజయం సాధించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ఆల్రెడీ లీకులు కూడా మొదలయ్యాయి. అలాగే పవన్ సుజీత్ దర్శకత్వంలో కూడా నటించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ చిత్రం ఒక రీ ఎంట్రీ లాంటి మూవీ అని చెప్పాలి. అజ్ఞాతవాసి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పవన్ పింక్ రీమేక్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. 2021లో ఈ చిత్రం రిలీజై ఘనవిజయం సాధించింది. పవన్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది.
అయితే పవన్ పింక్ రీమేక్ చేస్తున్నాడు అని చెప్పగానే ఫ్యాన్స్ తో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒరిజినల్ వర్షన్ హిందీలో అమితాబ్ బచ్చన్ నటించారు. అందులో ఎలాంటి మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. కేవలం కథ బలంతోనే పింక్ అక్కడ ఘనవిజయం సాధించింది. అలాగే తమిళంలో అజిత్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అలాంటి చిత్రాన్ని పవన్ మళ్ళి ఎందుకు రీమేక్ చేస్తున్నారు అంటూ వ్యక్తిరేకత.
కానీ దర్శకుడు వేణు శ్రీరామ్ మూలకథని ఆలాగే ఉంచి చాలా మార్పులు చేశారు. పవన్ ఇమేజ్ కి అనుగుణంగా వేణు శ్రీరామ్ చేసిన మార్పులు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. పవన్ లాయర్ పాత్రలో సూపర్ స్టైలిష్ గా అదరగొట్టారు. లాయర్ పాత్రలో పవన్ మ్యానరిజమ్స్ విజిల్స్ కొట్టించింది. ఈ చిత్రం విడుదలై ఆదివారం రోజుకి రెండేళ్లు పూర్తయింది.
దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. ఈ చిత్రంలో నటించిన నివేతా థామస్ , అంజలి, అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ చిత్రాన్ని గుర్తు చేసుకుని పోస్ట్ లు పెట్టారు. అయితే అంజలి చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. వకీల్ సాబ్ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఓ అభిమాని.. ఏపీలో విఆర్వో నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ ఓవర్ టైం, ఆదివారాలు కూడా డ్యూటీ చేసిన రోజులు అవి అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ని అనన్య నాగళ్ళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వకీల్ సాబ్ రిలీజైనప్పుడు టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సామాన్యుల కోసం అంటూ రూ. 10.. 30.. 70 ఇలా తక్కువ టికెట్ ధరలు నిర్ణయిస్తూ వకీల్ సాబ్ రిలీజ్ ముందు జీవో వదలడం తీవ్ర వివాదం అయింది. టికెట్ ధరల్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ అధికారులు థియేటర్స్ లలో తనికీలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.