అనన్య నాగళ్ళ శ్రీరామనవమి పోస్ట్ పై ట్రోలింగ్.. చీరలో అందంగా కనిపించినా తప్పలేదు
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు.
మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది.
ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది.
అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది.
సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. తాజాగా అనన్య శ్రీరామనవమి సందర్భంగా అందమైన చీరకట్టులో దేవతలా మెరిసింది.
స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలతో మెస్మరైజ్ చేస్తూ అనన్య నాగళ్ళ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. చిరునవ్వుతో మురిపిస్తూ అనన్య అందరిని ఆకట్టుకుంటోంది.
ఎగసి పడుతున్న ఎద సంపదతో ఆకర్షిస్తోంది. ఆమె ధరించిన శారీ ఎంతో అందంగా ఉంది. చీరకట్టులో సైతం అనన్య చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇచ్చింది. అలాగే అనన్య ఆభరణాలు ధరించి వెలుగులు విరజిమ్ముస్తోంది.
చందమామతో పోటీ పడే విధంగా ఆమె చిరునవ్వు, సిగ్గు మొగ్గలేస్తున్న చూపులు ఉన్నాయని యువత మురిసిపోతున్నారు. ఈ ఫోటోలకు అనన్య హ్యాపీ శ్రీరామనవమి అంటూ పోస్ట్ పెట్టింది. అసలు శ్రీరామనవమికి ఈ పోస్ట్ కి ఏమైనా సంబంధం ఉందా అంటూ నెటిజన్లు అనన్యని ట్రోల్ చేస్తున్నారు.
కమర్షియల్ గా హీరోయిన్ సక్సెస్ అయ్యేందుకు అనన్యకి అన్ని అర్హతలు ఉన్నాయనే చెప్పాలి. వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెకు వెబ్ సిరీస్ లు, ఓటిటీలలో అవకాశాలు దక్కుతున్నాయి. సమంత శాకుంతలం చిత్రంలో అనన్య కీలక పాత్రలో నటిస్తోంది.