ఆదిత్యరాయ్ కపూర్ తో ప్రేమలో అనన్య పాండే..క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తండ్రి.
బాలీవుడ్ యంగ్ స్టార్ అనన్య పాండే ప్రేమలో పడ్డారా..? గత కొంత కాలంగా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్నారా..? ఈ విషయంలో అనన్య తండ్రి ఇచ్చిన వివరణ ఏంటి..?

బాలీవుడ్ లోకి వారసత్వంగా వచ్చినా.. సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది హీరోయిన్ అనన్య పాండే. కాని ఆమె నటించే సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. అనన్యకు సాలిడ్ హిట్ కూడా పడటం లేదు. ఆమధ్య లైగర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ పై కన్నేసిన బ్యూటీకి నిరాశే మిగిలింది. దాంతో అసలు అవకాశాలే లేకుండా పోయాయి బ్యూటీకి.
Aditya Roy Kapur and Ananya Panday
ఇక తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రమలో మునిగి తేలుతున్నట్టు న్యూస్ గత కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి ఓ ఈవెంట్ కు స్పెయిన్ వెళ్లారు. అక్కడ వీళ్లు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. లైగర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యింది. ఎక్కువగా టూర్లకు వెళ్తూ.. లైఫ్ నుఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. అంతే కాదు. ఆమె ఈమధ్య హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఎక్కుగా కనిపిస్తోంది. దాంతో వీరు ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది.
Image: Varinder Chawla
ఇక వీరి ప్రేమ వ్యావహారంపై నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. అనన్య ఎక్కడికి వెళ్లిని ఈ విషయంలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో అనన్య పాండే తండ్రి చుంకీ పాండే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనన్య రిలేషన్ గురించి మాట్లాడారు.
Photo Courtesy: Instagram
అనన్య పాండే ఓ హీరోతో ప్రేమలో ఉందనేవార్తలు రూమర్స్ మాత్రమేనని అన్నారు చుంకీ పాండే. ఆమెతో కలిసి చాలా మంది నటులు పని చేశారని.. వారితో ఆమె చాలా స్నేహంగా ఉంటుందని అన్నారు. పనిచేసిన నటీనటులంతా తనతో స్నేహంగానే ఉంటారు" అని ఆమె
తండ్రి చంకీ పాండే తెలిపారు
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల రిలేషన్స్ గురించి తరచూ వార్తలు వస్తుంటాయి. ఇలాంటి రూమర్స్ వాళ్ల కెరీర్ కు నష్టం కలిగిస్తాయి. అన్నారు. అనన్య ఇప్పటి వరకు చాలామందితో కలిసి నటించింది. టైగర్ ప్రాఫ్, కార్తిక్ ఆర్యన్.. ఇలా ఎంతో మంది సినిమాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2లో నటిస్తోంది బ్యూటీ.