MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమర్‌ దీప్‌ ఇక్కడ కూడా కామెడీ పీస్ అయిపోయాడే.. అందరిలో పరువు తీసిన శ్రీముఖి.. దెబ్బకి షాక్‌

అమర్‌ దీప్‌ ఇక్కడ కూడా కామెడీ పీస్ అయిపోయాడే.. అందరిలో పరువు తీసిన శ్రీముఖి.. దెబ్బకి షాక్‌

టీవీ నటుడు, బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్ ఇప్పుడు టీవీ షోస్‌లో సందడి చేస్తున్నాడు. కెప్టెన్సీ విషయంలో ఆయన ఇక్కడ కామెడీ పీస్‌ అయిపోయాడు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 17 2024, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అమర్‌ దీప్‌.. టీవీ సీరియల్స్ తో పాపులర్‌ అయిన నటుడు. ఆయన గత సీజన్‌లో `బిగ్‌ బాస్‌` షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రారంభంలో ఆయన ఆట తీరు, ప్రవర్తన కామెడీగా ఉన్నా, ఆ తర్వాత అతనే క్రేజీ కంటెస్టెంట్ గా మారిపోయాడు. మోస్ట్ ఎంటర్‌టైనింగ్‌ కంటెస్టెంట్‌గానూ నిలిచాడు. అంతిమంగా టాప్‌ 5లో నిలిచారు. కానీ కప్‌ కొట్టలేకపోయాడు. పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎక్కువగా షోలో ఈ ఇద్దరి మధ్యనే గొడవలు జరిగాయి. ఆ గొడవలే వీరిని స్టార్లని చేశాయి. టాప్‌ 5కి వచ్చేలా చేశాయి. అయితే ఈ షోలో అమర్‌ దీప్‌ కెప్టెన్సీ గెలవలేకపోయాడు. పోరాడిన ప్రతిసారి ఓడిపోయాడు. తాను మిస్టేక్ చేయడమా? మిగిలిన వాళ్లు హ్యాండివ్వడమా కారణం ఏదైనా కెప్టెన్సీ దక్కలేదు. కానీ చివరి వారంలో ఆయనకు బిగ్‌ బాస్‌ పెద్ద మనసు చేసుకుని కెప్టెన్‌ని చేశాడు. అంటే ఆయన సాధిస్తే రాలేదు, పాపం అనుకుంటే వచ్చింది. మొత్తంగా ఆయన పోరాటం కామెడీగా మారింది. 
 

37

ఇప్పుడు మరోసారి కామెడీ పీస్‌ అయిపోయాడు అమర్‌ దీప్‌. మరోసారి ఆయనకు పాపం అనుకుంటే కెప్టెన్సీ వచ్చింది. మరి ఆ సంగతులేంటో చూస్తే.. బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్లతో ప్రస్తుతం స్టార్‌ మాలో `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో షో నిర్వహిస్తున్నారు.
 

47

శ్రీముఖి యాంకర్‌గా, అనసూయ, శేఖర్‌ మాస్టర్‌ గర్ల్స్, బాయ్స్ టీమ్‌కి లీడ్‌గా, జడ్జ్ లుగా ఉన్నారు. ఇందులో అమర్‌ దీప్‌తోపాటు అర్జున్‌, టేస్టీ తేజ, ప్రియాంక, శోభా శెట్టి, రీతూ చౌదరి, విష్ణు ప్రియా, సౌమ్య రావు వంటి వారు కంటెస్టెంట్లుగా రాణిస్తున్నారు. 

57

తాజాగా ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. అనసూయ `ఆకలేస్తే అన్నం పెడతాం` అంటూ హోటల్‌ని పెట్టి, వంటలు చేసే పోటీలు నిర్వహించారు. బాయ్స్ టీమ్‌కి అర్జున్‌  కెప్టెన్‌గా ఉన్నాడు. సడెన్‌గా ఆయన స్టేజ్‌మీదకు వచ్చేసి, తాను వాకౌట్‌ అయి, కెప్టెన్సీ అమర్‌కి ఇచ్చేద్దామనుకుంటున్నా అన్నాడు. దీంతో అది బెటర్‌, ఇక అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఈజీగా వస్తుంది కెప్టెన్సీ అని కౌంటర్‌ వేస్తుంది శోభా శెట్టి. 
 

67

ఇక రెచ్చిపోయిన శ్రీముఖి.. హౌజ్‌లో నాగార్జునగారు జాలిపడి కెప్టెన్సీ ఇచ్చి, ఇక్కడ ఏదో మొహమాటపడి అర్జున్‌ ఇచ్చేసి, కెప్టెన్సీ నీకు నువ్వు ఎప్పుడురా అయ్యేది` అంటూ షాకిచ్చింది. అది అవదమ్మా అని మరో కంటెస్టెంట్‌ కామెంట్‌ చేయడంతో దెబ్బకి అమర్ దీప్‌కి ఫ్యూజులు ఔట్‌ అయ్యాయి. ఇది ఆద్యంతం నవ్వులు పూయించాయి.

77

కానీ ఫైనల్ గా మరోసారి అమర్‌ దీప్‌ కామెడీ పీస్‌ అయిపోయాడు, ఇక్కడ కూడా ఆయన కమెడియన్‌ కావడం ఆశ్చర్యంగా మారింది. కింద కామెంట్లలోనూ నెటిజన్లు అలాంటి కామెంట్లే చేస్తుండటం గమనార్హం. కానీ ఏ చేసినా అమర్‌ దీప్‌ మంచి ఎంటర్‌టైనర్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved