MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బర్త్ డే రోజు భార్యతో రొమాంటిక్ గా అమర్ దీప్.. మా ఆయన చిన్నపిల్లోడు ఏమీ అనుకోవద్దు అంటూ ప్రశాంత్ తో..

బర్త్ డే రోజు భార్యతో రొమాంటిక్ గా అమర్ దీప్.. మా ఆయన చిన్నపిల్లోడు ఏమీ అనుకోవద్దు అంటూ ప్రశాంత్ తో..

తేజస్విని ఇంట్లో నుంచి బయటకి వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్ తో ఆసక్తికర సంభాషణ జరిగింది. పల్లవి ప్రశాంత్, అమర్ ఎక్కువగా గొడవ పడటం చూస్తూనే ఉన్నాం. దీనితో పల్లవి ప్రశాంత్ అన్న విషయంలో నన్ను ఏమి అనుకోవద్దు అని కోరాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 09 2023, 10:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో ఫ్యామిలీ టైం నడుస్తోంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి వస్తున్నారు. దీనితో హౌస్ లో భావోద్వేగాలతో కూడిన దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం రోజు 68వ ఎపిసోడ్ లో ముందుగా అమర్ దీప్ సతీమణి టివి నటి తేజస్విని గౌడ వచ్చారు. 

27

తేజస్విని రెడ్ శారీలో ఎంతో అందంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో అమర్ దీప్ ని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి పిలిచారు. అమర్ కి బిగ్ బాస్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు మీ భార్య ఈ కేకు పంపించారని బిగ్ బాస్ అమర్ కి కేక్ ఇచ్చారు. కానీ ఆమె రాలేకపోయారని అమర్ కి అబద్దం చెప్పారు. కేకు తీసుకుని వెళ్లి బయట అందరితో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోండి అని బిగ్ బాస్ తెలిపారు. 

37

దీనితో అమర్ నా భార్య రాలేదు.. కనీసం కేకు అయినా పంపింది అనుకుంటూ వస్తుండగా ఆమె బయటే ఉండడంతో అమర్ సర్ప్రైజ్ అయ్యాడు. వెంటనే తేజేస్విని గౌడ వచ్చి అమర్ ని కౌగిలించుకుంది. వాళ్ళిద్దరిని కాసేపు ఒంటరిగా వదిలేయండి అని శివాజీ ఇతర సభ్యులని బయటకి తీసుకువెళ్లారు. 

47

దీనితో అమర్, తేజస్విని సన్నిహితంగా ఉంటూ రొమాంటిక్ గా కబుర్లు చెప్పుకున్నారు. తేజస్విని అమర్ ని కౌగలించుకుని ఏడ్చేసింది. కుటుంబ సభ్యులంతా బావున్నారని తెలిపింది. అంతే కాదు అమర్ దీప్ కోసం ఒక రింగ్ కూడా తీసుకువచ్చింది. 

57

ఆ రింగ్ వాళ్ళిద్దరి ఎంగేజ్ మెంట్ రింగ్ అట. బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు ఇంట్లోనే పెట్టి వచ్చాడట. దీనితో తేజస్విని ఆ రింగ్ ని తన భర్తకి సినిమాటిక్ స్టైల్ లో తొడిగింది. ఆ తర్వాత ఇంటి సభ్యుల ముందు అమర్ కేక్ కట్ చేసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడు. భార్యకి కేక్ తినిపించాడు. తేజస్విని అమర్ కి రొమాంటిక్ గా కిస్ కూడా పెట్టింది. ఈ ముద్దు చెరిగిపోకూడదు అని తెలిపింది. అమర్.. తన భార్యని ఎత్తుకుని రొమాంటిక్ గా డ్యాన్స్ కూడా చేశాడు. ఆ దృశ్యాలు ఎంతో అందంగా ఉన్నాయి. 

67

ఇక తేజస్విని ఇంట్లో నుంచి బయటకి వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్ తో ఆసక్తికర సంభాషణ జరిగింది. పల్లవి ప్రశాంత్, అమర్ ఎక్కువగా గొడవ పడటం చూస్తూనే ఉన్నాం. దీనితో పల్లవి ప్రశాంత్ అన్న విషయంలో నన్ను ఏమి అనుకోవద్దు అని కోరాడు. అలాంటిది ఏమీ లేదు. మీరంతా బాగానే ఉన్నారు కదా .. బాగా ఆడండి అని తేజస్విని తెలిపింది. 

77

మా ఆయన కూడా చిన్న పిల్లోడు లాంటోడు.. మీరు కూడా మనసులో పెట్టుకోవద్దు అని కోరింది. తేజస్విని వెళ్ళాక శోభా శెట్టి తల్లి హౌస్ లోకి వచ్చారు. తన తల్లి రాగానే శోభా శెట్టి కేకలు పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లిని కౌగలించుకుని ఏడ్చేసింది. శోభా శెట్టి తల్లి ఇంట్లో అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం యావర్ సోదరుడు వచ్చారు. వారిద్దరి మధ్య కూడా భావోద్వేగపూరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే వారసురాలు-నిజం చెప్పిన దశరథ-దీపను షూట్ చేసిన జ్యో
Recommended image2
మహేష్ బాబు డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా? సూపర్ స్టార్ అంత సాహసం చేయగలడా..?
Recommended image3
Manchu Manoj: మేకర్స్ కి సవాల్‌ విసురుతున్న మంచు మనోజ్‌.. `డేవిడ్‌ రెడ్డి` కోసం కొత్త లుక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved