- Home
- Entertainment
- కొంటె చూపులు, ఫ్లైయింగ్ కిస్ లతో కవ్విస్తున్న అమలా పాల్.. రెడ్ డ్రెస్ లో రచ్చ చేసేలా పోజులు..
కొంటె చూపులు, ఫ్లైయింగ్ కిస్ లతో కవ్విస్తున్న అమలా పాల్.. రెడ్ డ్రెస్ లో రచ్చ చేసేలా పోజులు..
గ్లామర్ బ్యూటీ అమలాపాల్ (Amala Paul) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో తన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే వస్తోంది. అమలా పాల్ లేటెస్ట్ ఫొటోషూట్ మతిపోగొడుతోంది.

మలయాళీ హీరోయిన్ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్, నటనతో యూత్ లో తనకుంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది.
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. అందాల హీరోయిన్ గా అభిమానుల గుండెల్లో కాసంతా చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది.
సౌత్ ఇండస్ట్రీలో అమలాపాల్ కు మంచి మార్కెట్ ఉందనే చెప్పాలి. ఏ హీరో సరసన నటించినా అద్భుతమైన కెమిస్ట్రీని చూపించగల నటి అమలాపాల్. సరైన అవకాశాలు వచ్చినా.. సాలిడ్ హిట్ మాత్రం ఈ బ్యూటీ పడలేదు. కానీ పెర్ఫామెన్స్, గ్లామర్ విషయంలో అమలా పాల్ కు ఆడియెన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి.
ఏదుకోగానీ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. అటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు బోల్డ్ సీన్లలోనూ అమలాపాల్ నిర్మోహమాటంగా నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
గతంలో ఓటీటీ వేదికన రిలీజ్ అయిన పిట్ట కథలు Pitta Kathalu సినిమాలో మీరా పాత్రలో మతిపోయేలా యాక్ట్ చేసింది. ఏకంగా బోల్డ్ అందాలను విందు చేస్తూ యూత్ ను ఊర్రూతలూగించింది. అంతకు ముందు ‘ఆమె’ చిత్రంలోనూ న్యూడ్ గా నటించి షాక్ కు గురిచేస్తోంది.
లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో కవ్వించేలా పోజులిచ్చింది. మత్తు చూపులు, ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తూ నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వీకెండ్ సందర్భంగా ఈ పిక్స్ ను పోస్ట్ చేసింది. అభిమానులు, నెటిజన్లు లైక్ లు, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నాయి.