MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'ఎఫ్ 3' సెట్స్ లో అల్లు అర్జున్ సందడి.. వెంకీ మామ చేతిలో చేయి వేసి, సునీల్ భలే గెటప్ లో ఉన్నాడే!

'ఎఫ్ 3' సెట్స్ లో అల్లు అర్జున్ సందడి.. వెంకీ మామ చేతిలో చేయి వేసి, సునీల్ భలే గెటప్ లో ఉన్నాడే!

టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ యాక్షన్ చిత్రాలతో పాటు ఎఫ్3 లాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 06 2021, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ యాక్షన్ చిత్రాలతో పాటు ఎఫ్3 లాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. దానిని మించేలా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ లాంటి ప్రధాన నటీనటులపై దర్శకుడు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. చిత్ర యూనిట్ లో జోష్ ని మరింత పెంచేలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎఫ్3 సెట్స్ ని సందర్శించారు. చిత్ర యూనిట్ తో బన్నీ సరదాగా ముచ్చటించారు. ఎఫ్3 చిత్ర విశేషాలని దర్శకుడిని అడిగి తెలుసుకున్నారు. 

 

36

Venkatesh తో చేతిలో చేయి వేసి మాట్లాడారు. ఈ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోస్ లో Varun Tej , రాజేంద్ర ప్రసాద్, అనిల్ రావిపూడి, సునీల్ లని చూడొచ్చు. సునీల్ షోల్డర్ బెల్ట్ డ్రెస్ లో గమ్మత్తుగా కనిపిస్తున్నాడు. ఎఫ్2 ని మించేలా ఈ చిత్రంలో హాస్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

46

ఈ చిత్రంలో ఎఫ్2 లో నటించిన తమన్నా, మెహ్రీన్ లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎఫ్ 3 చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. కానీ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో ఎఫ్3 రిలీజ్ డేట్ మారుతుందా లేదా అనే క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. కరోనా ప్రభావం వల్ల భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ మొత్తం గందరగోళంగా మారాయి. 

 

56

ఇదిలా ఉండగా ఎఫ్3 సెట్స్ కి బన్నీ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ టీషీర్ట్ లో అల్లు అర్జున్ సింపుల్ గా స్టైలిష్ గా ఆకట్టుకుంటున్నాడు. పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ గుబురు గడ్డంలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. 

 

66

పుష్ప మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీలో బన్నీ ఎడమచేతి వాటం కలిగిన ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కనీవినీ ఎరుగని యాక్షన్ అంశాలతో అలరించనుంది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved