అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్.. రెపరెపలాడిన జనసేన జెండాలు!

First Published 31, Jul 2019, 8:08 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో బన్నీ 19వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ కోసం అల్లు అర్జున్ బుధవారం రోజు కాకినాడ నగరానికి చేరుకున్నాడు. 

కాకినాడలో ఓ ఫైట్ సన్నివేశంతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్ని త్రివిక్రమ్ తెరకెక్కించనున్నాడు. కాకినాడకు చేరుకున్న బన్నీకి ఘనస్వాగతం లభించింది.

బన్నీని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. కారుపై నిల్చుని బన్నీ అభిమానులకు అభివాదం చేశాడు. బన్నీ వెంట అభిమానులు ర్యాలీగా బయలుదేరారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ జెండాలు రెపరెపలాడుతూ కనిపించాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ విజయం సాధించలేదు. కానీ బన్నీ ఎన్నికల ప్రచారంలో పవన్ కు భీమవరం చేరుకొని మద్దతు తెలిపాడు.

అల్లు అర్జున్ కాకినాడ చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. టబు, సుశాంత్  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

loader