MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • `పుష్ప 2` టికెట్‌ రేట్స్ హైక్‌ ఆరాచకం, ఓపెన్‌గా దోచుకోవడమే ?

`పుష్ప 2` టికెట్‌ రేట్స్ హైక్‌ ఆరాచకం, ఓపెన్‌గా దోచుకోవడమే ?

అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప 2` సినిమాపై భారీ హైప్‌ ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకి టికెట్‌ రేట్స్ లో భారీ హైక్స్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేట్స్ వింటే ఫ్యూజుల్‌ ఔటే.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 30 2024, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా `పుష్ప 2` గురించే చర్చ. ఎలా ఉండబోతుందనేది? పాటలు, ట్రైలర్‌, అల్లు అర్జున్‌ పాత్ర, సినిమా బిజినెస్‌, కలెక్షన్లు గురించే ఎక్కువగా చర్చనడుస్తుంది. దీనితోపాటు ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించిన విషయాలు చర్చకు వస్తున్నాయి. అలాగే సినిమాపై హైప్‌ని పెంచేలా టీమ్‌ భారీ ప్రమోషనల్‌ ఈవెంట్లు నిర్వహిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈవెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

బిగ్ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పటికే లక్కో, చెన్నై, కొచ్చి, ముంబయిలో ఈవెంట్లు అయిపోయాయి. బెంగూళురు, హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతిలోనూ ఈవెంట్లు ఉండబోతున్నాయట. ఇలా దేశ వ్యాప్తంగా ఈవెంట్లు నిర్వహిస్తూ బిజీగా ఉంది టీమ్‌. ఇది సినిమాపై హైప్‌ని అమాంతం పెంచుతుంది. దీంతో కలెక్షన్ల టాపిక్‌ తెరపైకి వచ్చింది.

ఫస్ట్ డే ఎంత వసూలు చేయబోతుందనేది చర్చకు వస్తుంది. చిత్ర బృందం మాత్రం సుమారు రూ. 250కోట్లు టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది. అంతే ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమాకి సాధ్యం కాని ఓపెనింగ్స్ ని `పుష్ప2`తో టార్గెట్‌ చేయబోతున్నారట. 
 

36

అందుకు తగ్గట్టుగానే టికెట్‌ రేట్లు పెంచుతున్నారు. అయితే ఈ సారి భారీగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. ముఖ్యంగా బెనిఫిట్‌ షోస్‌కి మాత్రం ఆరాచకం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారీగా టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. బెనిఫిట్‌ షోస్‌ కోసం ఏకంగా ఎనిమిది వందలు పెంచే వెసులుబాటుని కల్పించింది.

అంటే ముందురోజు(డిసెంబర్‌ 4న రాత్రి 9.30) షోకి ఎనిమిది వందలు పెంచి టికెట్‌ రేట్లు అమ్మబోతున్నారు. ఈ లెక్కన సింగిల్‌ థియేటర్లలో ఒక్క టికెట్‌ ధర. 1121 ఉండబోతుంది. అదే మల్టీప్లెక్స్ లో రూ.1239 ఉండబోతుంది. ఒక సినిమా టికెట్‌ ధర ఈ స్థాయిలో ఉండటం నిజంగా దారుణం. 
 

46

ఇక డిసెంబర్‌ 5 మార్నింగ్‌ షోస్‌ నుంచి నాలుగు రోజులపాటు అంటే డిసెంబర్‌ 8 వరకు ఒక్కో టికెట్‌పై సింగిల్‌ థియేటర్లలో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో 200పెంచుకునే వెసులుబాటుని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. అంటే సింగిల్‌ థియేటర్లలో రూ.354, మల్టీప్లెక్స్ ల్లో 531 రూపాయలు ఉంటుంది.

రెండో వారంలో సింగిల్ థియేటర్లలో టికెట్‌పై 105 రూపాయలు, మూడో వారంలో 20 రూపాయలు పెంచుకోవచ్చు అని తెలిపింది. మల్టీప్లెక్స్ ల్లో మొదటి 4 రోజులు రెండు వందలు, రెండో వారం 150 రూపాయలు, మూడో వారం యాభై రూపాయలు పెంచుకునే వెసులుబాటుని ఇచ్చింది. ఇలా దాదాపు మూడు వారాలపాటు పెంచిన రేట్లతోనే టికెట్‌ అమ్మబడుతుంది 
 

56
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar

సాధారణంగా మొదటి వారంకి మాత్రం టికెట్‌ రేట్లుపెంచుకునే అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ మూడు వారాలు పెంచుకునే అవకాశం ఇవ్వడమే ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఓ రకంగా ఓపెన్‌గా దోచుకోవడమే అని నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. జనాల అభిమానాన్ని దోచుకోవడమే అంటున్నారు.

నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే ఈజీగా 2500ఖర్చు చేయాల్సిందే. అదే స్నాక్స్ లాంటివి తీసుకోవాలంటే మరో వెయ్యి, 1500 అదనం అవుతుంది. అంటే ఒక్కో ఫ్యామిలీ ఈజీగా మూడు నుంచి నాలుగు వేలు ఒక్క సినిమా చూడ్డానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది చాలా దారుణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

66

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన `పుష్ప 2` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌, జగపతి బాబు నెగటివ్‌ రోల్స్ చేస్తున్నారు. సునీల్‌, అనసూయ, రావు రమేష్‌లవి కూడా కీలక పాత్రలే అని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న భారీగా విడుదల కాబోతుంది. సుమారు 12000 థియేటర్లలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తుంది టీమ్‌. మరి ఈ మూవీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. 

Read more: సీఎం ఆఫీస్‌కి వచ్చి ముద్దు పెట్టిన అమ్మాయి.. నగలతో వచ్చి పెళ్లికి డిమాండ్‌, ఎన్టీఆర్‌ ఏం చేశాడో తెలుసా?

also read: `హరిహర వీరమల్లు` కొత్త లుక్‌, పవన్‌ ఫ్యాన్స్ కి కావాల్సింది ఇదే కదా.. అదిరిపోయే గుడ్‌ న్యూస్‌
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలంగాణ
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Recommended image2
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image3
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved