వరుణ్‌తేజ్-లావణ్యలకు అల్లు అర్జున్ ప్రీ వెడ్డింగ్ పార్టీ.. మెగా ఫ్యామిలీ సందడి.. ఆ ఇద్దరు మిస్సింగ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మధ్య బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చిన వరుణ్, ఇప్పుడు బన్నీ పార్టీ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేశారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట మరో పదిహేను రోజుల్లో ఒక్కటి కాబోతుంది. దీంతో వరుసగా ప్రీ వెడ్డింగ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో వరుణ్ తేజ్ బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చారు. ఇటీవల మెగా ఫ్యామిలీ అంతా కలిసి ప్రీ వెడ్డింగ్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగింది.
ఇక ఇప్పుడు బన్నీ పార్టీ ఇచ్చారు. కాబోయే జంట వరుణ్ తేజ్, లావణ్యలకు ఆయన గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో మెగా ఫ్యామిలీ పాల్గొంది. బన్నీ, అల్లు స్నేహారెడ్డితోపాటు చిరంజీవి, సురేఖ, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాగాబాబు, ఆయన భార్య, నిహారిక, అలాగే అల్లు అర్హ, అల్లు అయాన్, అల్లు అరవింద్, ఆయన భార్య, చిరంజీవి మనవరాళ్లు పాల్గొన్నారు.
వీరితోపాటు మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, హీరో నితిన్, రీతూ వర్మ, చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ, రామ్‌చరణ్ వైఫ్ ఉపాసన పాల్గొన్నారు. అయితే ఇందులో ఇద్దరు ప్రధానంగా మిస్ అయ్యారు. బన్నీ అన్నయ్య బాబీ కనిపించలేదు. వీరితోపాటు పవన్ కళ్యాన్, రామ్‌చరణ్ మిస్ అయ్యారు. చరణ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పవన్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఒక్కటి రాబోతున్నారని సమాచారం. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. దీంతో నెల రోజుల ముందు నుంచే ప్రీ వెడ్డింగ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తుంది మెగా ఫ్యామిలీ. వరుణ్ తేజ్ పెళ్లి చాలా స్పెషల్‌గా మార్చేస్తున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య.. `మిస్టర్` చిత్ర సమయంలో ప్రేమ పడ్డారని సమాచారం. ఆ సినిమా పరాజయం చెందింది. కానీ ఈ ఇద్దరి ప్రేమకి పునాది వేసిందట. ఆ తర్వాత `అంతరిక్షం` చిత్రంలోనూ కలిసి నటించారు. ప్రేమ మరింత బలపడింది. గతేడాది తామిద్దరు ప్రేమలో ఉన్నారనే హింట్ ఇచ్చారు. దీంతో పుకార్లు ఊపందుకున్నాయి. ఎట్టకేలకు ఈ సమ్మర్‌లో తమ ప్రేమని, పెళ్లి విషయాన్ని కన్ఫమ్ చేశారు.