- Home
- Entertainment
- భార్యతో కలిసి ఢిల్లీకి అల్లు అర్జున్.. ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా అల్లు స్నేహారెడ్డి..
భార్యతో కలిసి ఢిల్లీకి అల్లు అర్జున్.. ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా అల్లు స్నేహారెడ్డి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఢిల్లీకి బయలు దేరారు. ఆయన తన భార్యతో కలిసి వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్(Allu Arjun).. జాతీయ ఉత్తమ నటుడిగా(Best Actor) ఎంపికైన విషయం తెలిసిందే. `పుష్ప` (Pushpa) చిత్రానికిగానూ ఆయన బెస్ట్ యాక్టర్‌గా ఎంపికయ్యారు. గత నెలలో ఈ జాతీయ అవార్డులను ప్రకటించారు. తొలి సారి తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎపిక కావడం ఇదే మొదటిసారి. దీంతో బన్నీ చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు.
ఇక రేపు ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంది. అందులో పాల్గొనేందుకు, జాతీయ అవార్డు అందుకునేందుకు బన్నీ ఢిల్లీ వెళ్లారు. ఆయన తన భార్య అల్లు స్నేహరెడ్డితో కలసి వెళ్లడం విశేషం.
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ లో ఈ ఇద్దరు సందడి చేశారు. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో అల్లు స్నేహారెడ్డి(Allu Sneha Reddy) స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలడం విశేషం. ఆమె వైట్ టాప్, బ్లూ జీన్స్ ధరించింది. అయితే ప్యాంట్‌కి, టాప్‌కి మధ్య కొద్దిగా గ్యాప్ ఇచ్చి హంట్ చేస్తుంది స్నేహారెడ్డి.
కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సూపర్ హాట్‌గానే కాదు, చాలా స్టయిలీష్‌గా ఉంది. ఇక బన్నీని డామినేట్ చేస్తుంది. ఇందులో బన్నీ బ్లాక్ టీషర్ట్, కాజ్వల్ బ్లాక్ ప్యాండ్ ధరించారు. స్టయిలీష్ గ్లాసెస్ ధరించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరితోపాటు `పుష్ప` టీమ్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. సుకుమార్, మైత్రీ నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ కూడా రేపు(అక్టోబర్ 17) జాతీయ అవార్డు ప్రధానోత్సవ వేడుకలో పాల్గొనబోతున్నారు. మ్యజిక్ విభాగంలో డీఎస్పీకి జాతీయ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం `పుష్ప 2` చిత్ర షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం మళ్లీ స్టార్ట్ చేయబోతున్నారు.
ఈ సారి జాతీయ అవార్డుల్లో అత్యధికంగా తెలుగుకి పది అవార్డులు దక్కాయి. `ఆర్‌ఆర్‌ఆర్` కి ఆరు అవార్డులు దక్కగా, `పుష్ప`కి రెండు, `కొండపొలం`కి ఒకటి, `ఉప్పెన`కి ఒక అవార్డు దక్కింది. దీంతోపాటు సినీ విశ్లేషణకుడిగానూ జాతీయ అవార్డు వరించింది.
`పుష్ప` చిత్రంలో బన్నీ హీరోగా నటించగా, రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో సమంత స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. ఇది 2021 డిసెంబర్ 17న విడుదలైంది. ప్రస్తుతం దీనికి రెండో పార్ట్ రూపుదిద్దుకుంటుంది.