KGF 2- Pushpa2: పది కెజిఎఫ్ లు ఒక పుష్ప అయితే... వంద కెజిఎఫ్ 2లు ఒక పుష్ప 2నా?
కెజిఎఫ్ చాప్టర్ 2 రికార్డు వసూళ్లు సాధించడం బన్నీ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుండగా, వాళ్ళు ఒకింత నొచ్చుకుంటున్నారు. దానికి కారణం గతంలో జరిగిన ఓ వివాదం.

KGF Chapter 2- Pushpa
పుష్ప (Pushpa) విడుదలకు ముందు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఓ కామెంట్ చేశారు. ఆయన పుష్ప చిత్రాన్ని పొగిడే క్రమంలో కెజిఎఫ్ ని తగ్గించి మాట్లాడారు. పది కెజిఎఫ్ లు కలిపితే ఒక పుష్ప... సినిమా ఆ రేంజ్ లో ఉంటుందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కెజిఎఫ్ ని కించపరచాలనే ఉద్దేశం ఆయనకు లేకున్నప్పటికీ అలా పోల్చి చెప్పడం బ్యాక్ ఫైర్ అయ్యింది.
KGF Chapter 2- Pushpa
కెజిఎఫ్(KGF) అభిమానులు, అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఈ విషయంలో బుచ్చిబాబును ఏకిపారేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడ్డారు. కెజిఎఫ్ లాంటి చిత్రాన్ని పుష్పతో పోల్చుతావా? అసలు పుష్ప ఎక్కడా? కెజిఎఫ్ ఎక్కడా అంటూ ఎద్దేవా చేశారు.
KGF Chapter 2- Pushpa
అయితే పుష్ప విజయం సాధించడంతో అల్లు అర్జున్ (Allu Arjun)ఫ్యాన్స్ తమ స్టేట్మెంట్ కరెక్టే అంటూ కాలర్ ఎగరేశారు. కారణం పుష్ప హిందీలో కెజిఎఫ్ వసూళ్లను క్రాస్ చేసింది. కెజిఎఫ్ హిందీ వర్షన్ రూ. 45 కోట్ల వసూళ్లు రాబట్టింది. పుష్ప వంద కోట్లకు పైగా నెట్ వసూళ్లు అందుకుంది. కెజిఫ్ పార్ట్ 1 వసూళ్లను పుష్ప దాటేసింది.
KGF Chapter 2- Pushpa
అయితే కెజిఎఫ్ సీక్వెల్ కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2)వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. హిందీలో ఈ మూవీ పుష్ప రికార్డు రెండు రోజుల్లో లేపేసింది. ఐదు రోజులకు గాను రూ. 219 కోట్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 వసూళ్లు ఆరువందల కోట్లు దాటేశాయి. వేయి కోట్ల మార్క్ కెజిఎఫ్ 2 కి కేక్ వాక్ వలె కనిపిస్తుంది.
KGF Chapter 2- Pushpa
ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఏ ఇండియన్ సినిమాకైనా కష్టమే. మరి పుష్ప పార్ట్ 2తో అల్లు అర్జున్ కెజిఎఫ్ 2ని బీట్ చేయగలడా అంటే చెప్పలేం. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మినహా ఈ తరహా వసూళ్లు సాధ్యం కావు. ఈనేపథ్యంలో కెజిఎఫ్ చాప్టర్ 2 వసూళ్లతో పుష్పను పోల్చుతూ యష్ ఫ్యాన్స్ మరలా సోషల్ మీడియా ట్రోల్స్ కి దిగే అవకాశం కలదు.
KGF Chapter 2- Pushpa
ఇదే మానసికంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. మరి కెజిఫ్ కి పుష్ప టెన్ టైమ్స్ ఎక్కువైతే కెజిఫ్ 2 కి పుష్ప 2 కూడా టెన్ టైమ్స్ ఎక్కువనో కాదో బుచ్చిబాబు చెప్పాలి. ఏది ఏమైనా పాన్ ఇండియా స్టార్స్ కి యష్(Yash)-ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 రూపంలో సవాల్ విసిరారు. ఇకపై విడుదలయ్యే భారీ బడ్జెట్ చిత్రాలు కెజిఫ్ 2 వసూళ్లను దృష్టిలో ఉంచుకోవాలి.
బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)చిత్రాల తర్వాత ఆరేంజ్ ప్రభంజనం ఒక్క కెజిఎఫ్ 2 మాత్రమే అందుకోగలిగింది. ఇక తెలుగులో స్టార్ హీరోలు వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. మరి రాజమౌళి, ప్రశాంత్ నీల్(Prashanth neel) కే సాధ్యమైన ఈ స్థాయి రికార్డులు ఏ దర్శకుడు కొల్లగొడతాడో చూడాలి.