ఫెస్టివల్ మూడ్‌లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ ఫోటోస్ వైరల్
దసరా పండగా ఈ సారి ఇంటికే పరిమితమైంది. కరోనా కారణంగా అందరు కలవలేని పరిస్థితి. దీంతో ఇంట్లోనే పండుగని జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్ విజయదశమి పండుగని పురస్కరించుకుని ఫ్యామిలీ ఫోటోని పంచుకున్నాడు.
విజయదశమి సందర్భంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఇందులో ఆయనతోపాటు భార్య స్నేహారెడ్డి, అల్లు అయాన్, అర్హా కొత్త దుస్తులు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. కలర్ ఫుల్ డ్రెస్‌లో వీరి ఫోటో కనువిందుగా ఉంది. అభిమానులు పండగా చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా అభిమానులు, తెలుగు ప్రజలకు బన్నీ ఫ్యామిలీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు తన కూతురు అర్హ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు బన్నీ.
కొత్త డ్రెస్‌లో క్యూట్ లుక్స్ తో అర్హ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతిలో `అలా వైకుంఠపురములో`తో ఇండస్ట్రీ రికార్డ్ లను బద్దలు కొట్టారు. `బాహుబలి` తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ ఊపులోనే క్రేజీ సినిమాలు చేస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు బన్నీ.