- Home
- Entertainment
- Allu Arjun: మీ కూతుర్ని ప్రేమిస్తానని టీచర్ ని బెదిరించిన బన్నీ.. వామ్మో చిన్నతనంలోనే పుష్పరాజ్..
Allu Arjun: మీ కూతుర్ని ప్రేమిస్తానని టీచర్ ని బెదిరించిన బన్నీ.. వామ్మో చిన్నతనంలోనే పుష్పరాజ్..
అల్లు అరవింద్.. అల్లు అర్జున్ స్కూల్ డేస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు డిగ్నిఫైడ్ గా, జెంటిల్ మ్యాన్ గా ఉండే అల్లు అర్జున్ చిన్నతనంలో ఎలా ఉండేవారు అని సమంత ప్రశ్నించింది.

Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఒక ఫన్నీ సన్నివేశం ఉంటుంది. అల్లు అర్జున్ వైపు చూసి నవ్వడానికి కేశవ.. రష్మిక కు 1000 రూపాయలు ఇస్తాడు. అది తెలుసుకున్న అల్లు అర్జున్.. సరే కానీ ఇంకో 5 వేలు ఇస్తాను ముద్దు పెడుతుందేమో అడుగు అని అంటాడు. దీనితో కేశవ షాక్ కి గురవుతాడు. నువ్వు ఇట్లాంటోడివి అని అనుకోలేదు మచ్చా అని షాకవుతాడు.
Allu Arjun
అల్లు అర్జున్ చిన్నతనంలో చేసిన ఘనకార్యాలు వింటే.. బన్నీ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అంతే.. బన్నీ ఇట్లాంటోడా అని ఆశ్చర్యపోతారు. నేడు అల్లు అర్జున్ తన 40వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. దీనితో అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి.
Allu Arjun
సమంత హోస్ట్ గా చేస్తున్న సామ్ జామ్ కార్యక్రమంలో అల్లు అరవింద్.. అల్లు అర్జున్ స్కూల్ డేస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు డిగ్నిఫైడ్ గా, జెంటిల్ మ్యాన్ గా ఉండే అల్లు అర్జున్ చిన్నతనంలో ఎలా ఉండేవారు అని సమంత ప్రశ్నించింది. చిన్నతనంలో అల్లు అర్జున్ అల్లరి భరించడం చాలా కష్టంగా ఉండేది అంటూ రెండు చేతులతో దండం పెట్టాడు.
Allu Arjun
బన్నీ అల్లరికి ఉదాహరణగా ఓ ఇన్సిడెంట్ చెప్పాడు. అల్లు అర్జున్ 11వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి ఫోన్ వచ్చింది. తండ్రి వచ్చి ప్రోగ్రస్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పారు. నేను వెళ్లాను. టీచర్ ప్రోగ్రస్ రిపోర్ట్ ఇచ్చారు. ప్రతి సబ్జెక్టు లో మార్కులు 20, 30 ఉన్నాయి. టీచర్ క్లాస్ పీకడం గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయాను.
Allu Arjun
ఆయన వంక దీనంగా చూస్తే.. యు కెన్ గో సర్ అని అన్నారు. ఇంకేమైనా చెబుతారేమోనని కాసేపు అలాగే చూశాను.. చెప్పడానికి ఏమీ లేదు మీరు వెళ్లొచ్చు అని అన్నారు. అల్లు అర్జున్ వైపు చూస్తే అమాయకంగా చూస్తున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్రెండ్స్ ద్వారా ఒక విషయం తెలిసింది.
Allu Arjun
అంతకు ముందు రోజు బన్నీ వాళ్ళ టీచర్ ని బ్లాక్ మెయిల్ చేశాడట. మా నాన్న వచ్చినప్పుడు మీరేమి మాట్లాడకూడదు. లేకుంటే మీ కూతుర్ని లవ్ లో పడేస్తా అని బెదిరించాడట. దీనితో పాపం ఆ టీచర్ బయపడిపోయాడు అని అల్లు అరవింద్.. బన్నీ తుంటరి వేషాలని రివీల్ చేశారు.