MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sudigali sudheer: సుడిగాలి సుధీర్ పెళ్ళికి సర్వం సిద్ధం... అనూహ్యంగా అమ్మాయి ఎవరంటే...?

Sudigali sudheer: సుడిగాలి సుధీర్ పెళ్ళికి సర్వం సిద్ధం... అనూహ్యంగా అమ్మాయి ఎవరంటే...?

బుల్లితెర సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న సుధీర్, హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నారు.ఇక సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) పెళ్లి వార్త ఎవర్ గ్రీన్ టాపిక్ కాగా, ఈసారి సర్వం సిద్ధం అన్నట్లు సమాచారం అందుతుంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 07 2021, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


జబర్దస్త్ (jabardasth) షోలో సుడిగాలి సుధీర్ టీమ్ కి మంచి పేరుంది. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనుతో కూడిన ఈ టీమ్ నాన్ స్టాప్ కామెడీ పంచుతున్నారు. దీనితో ఈ త్రయం చాలా ఫేమస్ అయ్యారు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన సుధీర్... మరింతగా ఫేమ్ రాబట్టి బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పోవే పోరా వంటి షోలలో యాంకర్ గా కూడా చేస్తున్నారు.

27

 
సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్, తన ఫ్రెండ్స్ శ్రీను, రామ్ ప్రసాద్ తో కలిసి త్రీ మంకీస్ అనే మూవీ చేయడం జరిగింది. ప్రస్తుతం సుధీర్ హీరోగా రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఒకప్పుడు తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడ్డ సుధీర్, ప్రస్తుతం రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు

37

34ఏళ్ల సుధీర్ పెళ్లి గురించి తరచుగా కథనాలు వెలువడుతూ ఉంటాయి. ముఖ్యంగా యాంకర్ రష్మీ గౌతం (Rashmi gautam)తో సుధీర్ కి పెళ్లి అంటూ పుకార్లు లేస్తూ ఉంటాయి. బుల్లితెర లవ్ బర్డ్స్ గా సుధీర్, రష్మీ పేరు తెచ్చుకున్నారు. దీని ఆధారంగా వీళ్లపై అనేక బుల్లితెర ప్రోగ్రామ్స్ జరిగాయి. ఉత్తుత్తి పెళ్లిళ్లు కూడా నిర్వహించారు. రష్మీ, సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. బుల్లితెరపై వాళ్ళ కెమిస్ట్రీనే ఇందుకు కారణం. 

47

అయితే అదంతా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే అని సన్నిహితులు అంటారు. మా మధ్య స్నేహం మాత్రమే ఉందని రష్మీ, సుధీర్ ఓపెన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ కోసం, క్రేజ్ కోసం ఇద్దరూ అలాంటి ఓ రూమర్ తమపై కొనసాగిస్తున్నారు. సుధీర్ పెళ్లి మాత్రం వేరొకరితోనే ఉంటుంది. 

57

కాగా సుధీర్ పెళ్ళికి దాదాపు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఏజ్ బారైన సుధీర్ కి పెళ్లి చేయాలని తన ఇద్దరు మిత్రులు... గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కంకణం కట్టుకున్నారట. ఓ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారట. 
 

67

సుధీర్ బంధువులకు చెందిన ఓ అమ్మాయితో సుధీర్ కి సంబంధం కుదిర్చారట. ఆ అమ్మాయి సుధీర్ కి కూడా బాగా నచ్చిందట. ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు కూడా పూర్తి కాగా, పెళ్లి ప్రకటనే తరువాయి అన్న మాట వినిపిస్తుంది. అమ్మాయిది సుధీర్ సొంత జిల్లానే అని తెలుస్తుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


 

77

ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన అవినాష్ వివాహం చేసుకున్నారు. కొద్దినెలల క్రితం అనుజా అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న అవినాష్, గత నెలలో వివాహం చేసుకున్నారు. మరి సుధీర్ వివాహం కూడా జరిగితే జబర్దస్త్ నుండి మరో బ్యాచ్ లర్ సింగిల్ స్టేటస్ కాస్త మ్యారీడ్ అవుతుంది. 

Also read  `రాజావిక్రమార్క` ఈవెంట్‌లో కాబోయే భార్యని పరిచయం చేసిన కార్తికేయ.. లవ్‌ స్టోరీ కూడా చెప్పేశాడు..

Also read దీప్తి సునైనా అలిగితే వేరే లెవల్‌ టార్చరే అట.. షణ్ముఖ్‌ బోల్డ్ కామెంట్‌.. చుక్కలు చూపించిన సిరి
 

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image2
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Recommended image3
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved