Alia - Ranbir Marriage: సెంటిమెంట్ ఫాలో అవుతున్న ఆలియా, రణ్ బీర్, పెళ్ళి అక్కడేనట
బాలీవుడ్ ప్రేమ పక్షులు ఆలియాభట్,రణ్ భీర్ పెళ్ళి మళ్ళి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అదిగో అప్పుడు... ఇదిగో ఇప్పుడు అంటూ చాలా కాలంగా హడావిడి నడుస్తున్నా.. కరెక్ట్ డేట్ చెప్పిన వారులేరు. ఇక రీసెంట్ గా వారి పెళ్లి గురించి మరోసారి హడావిడి స్టార్ట్ అయ్యింది.

అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లి గురించి చాలా కాలంగా.. చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.సోషల్ మీడియాల్లో ఎప్పటికప్పుడు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంటాయి. కాని ఇప్పటి వరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వారి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు స్టార్ట్ అయినట్టు తెలుస్తొంది.
ఈ సారి మాత్రం రణ్‌బీర్-అలియాల పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. ఈ జంటకు వెడ్డింగ్ బెల్స్ దగ్గరికి వచ్చాయని సమాచారం. సోషల్ మీడియాలో వీరి పెళ్శి గురించి రెండు డేట్లు వినిపిస్తున్నాయి. వీరు ఏప్రిల్‌లోనే ఒక్కటవ్వబోతున్నారంటూ బిటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాదు కాదు వీరి పెళ్లి వచ్చే అక్టోబర్ లో అంటూ మరో డేట్ ప్రచారంలో ఉంది.
అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లి ఎప్పుడెప్పుడాని ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020 డిసెంబర్‌లో జరగాల్సి వీరి వివాహం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎంతో కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంజ పెళ్లికి ఇరు కటుంబాలు సైతం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చాయి. అలియా-రణ్‌బీర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పటికే వారి పెళ్లి అయిపోయిందంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక వీరిద్దరి పెళ్లిపై బాలీవుడ్ తో పాటు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి ఇద్దరి పెళ్ళికి సంబంధించి మరో న్యూస్ ఆసక్తి కరంగా మారింది. ఆ మధ్య పెళ్ళి చేసుకున్న బాలీవుడ్ కపుల్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ మాదిరిగా వీరు కూడా పెళ్లి విషయంలో సీక్రేట్ పాటిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ఏప్రిల్‌లో వీరిద్దరూ పెళ్లి పీటల ఎక్కడం ఖాయమనే వార్తలు బీ-టన్‌లో బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరి పెళ్లి ఓ సెంటిమెంట్ ప్లేస్‌లో జరుగుందనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఇప్పటికే దీనికి ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యిందట. ఇప్పటికే ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లి బట్టలు డిజైను చేయించుకునే పనిలో ఉన్నారట.
అయితే అలియా-రణ్‌బీర్‌లు డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా తమ ఫ్యామిలీ సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో రణ్‌బీర్- ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. కాగా కపూర్ కుటుంబ సభ్యులు ముంబైలోని ఆర్కే హౌస్ సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. రణ్‌బీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్‌ల పెళ్లి కూడా అక్కడే జరిగిందట.
ఇక ఇప్పుడు రణ్‌బీర్ పెళ్లి కూడా అక్కడే జరిపించాలని కపూర్ ఫ్యామిలీ పిక్స్ అయ్యారట. అందుకే రణ్ బీర్,ఆలియా వారి సోంతంగాఎలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకొకుండా ఇండి పెద్దలకు వారి పెళ్లి బాధ్యత అప్పజెప్పేశారట.
ఆర్కే హౌజ్‌లో కొద్దిమంది సన్నిహితులు, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా రణ్ బీర్, ఆలియా భట్ పెళ్ళిజరుపుకోవాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. కాగా రణ్‌బీర్-అలియా జంటగా నటించిన బ్రహ్మస్త్ర తొలి పార్ట్ షూటింగ్ రీసెంట్‌గా పూర్తయ్యింది. అటు మిగతా షూటింగ్స్ నుంచి కూడా బ్రేక్ తీసుకున్నారట బాలీవుడ్ కపుల్.