MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాలీవుడ్ ఫిల్మ్ షూటింగ్ కు బయల్దేరిన అలియా భట్.. భయంగా ఉందంటున్న బాలీవుడ్ బ్యూటీ.. వైరల్ పోస్ట్

హాలీవుడ్ ఫిల్మ్ షూటింగ్ కు బయల్దేరిన అలియా భట్.. భయంగా ఉందంటున్న బాలీవుడ్ బ్యూటీ.. వైరల్ పోస్ట్

బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) త్వరలో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ ప్రారంభం కాానుంది. కాగా, షూటింగ్ కు వెళ్తున్న సందర్భంగా తన ఫీలింగ్ ను అభిమానులతో షేర్ చేసుకుంది అలియా భట్. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 19 2022, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హాలీవుడ్ ఫిల్మ్ ల నటిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ పక్కన అలియా స్క్రీన్ షేర్ చేసుకోనుడటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే చిత్రంలో అలియా భట్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఐశ్యర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె లాంటి బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అలియా ఆ అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంతో అలియా క్రేజ్ అంతర్జాతీయ పెరగనుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాగా, ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, వండర్ వుమెన్’ సినిమాలతో హాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన హీరోయిన్ గాల్ గ్యాడ‌ట్‌తో కలిసి అలియా నటించనుంది. గాల్ గ్యాడెట్, ఆమె భ‌ర్త జేర‌న్ వార్స‌నో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అలియా భట్ తన మొట్టమొదటి హాలీవుడ్ చిత్ర షూటింగ్ కు బయలుదేరింది. ఈ సందర్భంగా తనకు కలిసి ఫీలింగ్ ను అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ కూడా పెట్టింది. 
 

36

పోస్ట్ షేర్ చేస్తూ ఇలా రాసింది అలియా.. ‘నేను నా మొట్టమొదటి హాలీవుడ్ చిత్రం షూట్‌కి వెళుతున్నాను!!!! మళ్లీ కొత్తదనపు అనుభూతిని పొందుతున్నాను. మరోవైపు చాలా భయాందోళనలు ఉన్నాయి. నావెంటే అదృష్టం ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపింది. ఈ సందర్భంగా ఆమెకు మద్దతు తెలుపుతూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘ఆల్ ద బెస్ట్’ చెబుతూ భరోసానిచ్చారు. అయితే ఈ పోస్ట్ షేర్ చేసిన గంట సమయంలో 10 మిలియన్ల లైక్స్ దక్కడం విశేషం.
 

46

ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న అలియా భట్ చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటించి నార్త్ మరియు సౌత్ ప్రేక్షకులను అలరించింది. ఈ మల్టీస్టారర్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన సీత పాత్రలో నటించింది. సినిమాలో అలియా స్క్రీన్ టైం చాలా తక్కువే ఉన్నా.. ఆడియెన్స్ ను ఆకట్టుకోగలిగింది. అంతకుముందు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కథియావాడి’ చిత్రంలో ముంబయి మాఫియా క్వీన్ పాత్రలో నటించి మెప్పించింది. ఆడియెన్స్ ను మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్లలను అదుర్స్ అనిపించింది.
 

56

అలియా భట్, గత నెల 14న  తన ప్రియుడు, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ (Ranbir Kapoor)ను పెళ్లి చేసుకుంది. ముంబయిలో రాజ్ స్టూడియోలో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య ఈ స్టార్ కపుల్ ఒక్కటయ్యారు. చాలా సీక్రెట్ గా పెళ్లిపీటలెక్కిన ఈ జంట.. వివాహ అనంతరం అధికారికంగా ప్రకటించారు. దీంతో వారి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. 

66

ఇటీవల అలియా పోస్ట్-వెడ్డింగ్ చిత్రాలను షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అలియా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో, భర్త రన్బీర్ కపూర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లోనూ కనిపించనుంది. ‘డార్లింగ్స్’ అనే మూవీలోనూ నటిస్తోంది. అదే విధంగా ఈ చిత్రానికి అలియా నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ మూవీలో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Rakul Preet Singh: రామాయణంలో శూర్పణఖగా రకుల్ ని మాత్రమే ఎందుకు తీసుకున్నారో తెలుసా? షాకింగ్ విషయాలు
Recommended image2
KTR: మహేష్‌ బాబుతో పోలికపై మాజీ మంత్రి హాట్‌ కామెంట్‌.. తనకు అలాంటి వ్యామోహాలు లేవంటూ స్టేట్‌మెంట్‌
Recommended image3
Suriya: 50 ఏళ్ల సూర్య తన క్రష్ అంటున్న 25 ఏళ్ల హీరోయిన్ ఎవరో తెలుసా? ఇద్దరు జంటగా నటిస్తున్నసినిమా ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved