ఎన్టీఆర్‌కి ఊహించని షాకిచ్చిన అలియాభట్.. పెళ్లి చేసుకుంటే అలా చేస్తారా?
మొన్నటి వరకు ఊరించిన `ఆర్‌ఆర్‌ఆర్` హీరోయిన్ అలియాభట్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్టీఆర్‌కి షాకిచ్చింది. మ్యారేజ్ చేసుకున్న ఆనందంలో ఊహించని విధంగా ఝలక్ ఇచ్చింది. సందిగ్దంలో పడేసింది.

`ఆర్‌ఆర్‌ఆర్`(RRR) హీరోయిన్ అలియాభట్(Alia Bhatt) తెలుగు ఆడియెన్స్ కి సీతగా గుర్తుండిపోతుంది. ఆమె పాత్ర చిన్నదే అయినా తన ప్రభావాన్ని చూపించింది అలియాభట్. ఆమె ఈ సినిమా విజయం అనంతరం మూడు రోజుల క్రితమే తన ప్రియుడు, కోస్టార్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం వీరి వివాహం పూర్తి ప్రైవేట్‌గా, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగింది.
వివాహం అనంతరం పనులతో దాదాపు నెల రోజుల వరకు బిజీగా ఉండబోతుంది అలియాభట్. హనీమూన్ ప్లాన్‌లోనూ ఉన్నారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్ రెండింటిని ఒకే సారి కంప్లీట్ చేసుకోబోతున్నారు. మరోవైపు ఇప్పటికే అలియాభట్ చాలా సినిమాలకు కమిట్ అయ్యింది. ఓ వైపు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి `బ్రహ్మస్త్ర`లో నటిస్తుంది. ఇది విడుదలకు రెడీ అవుతుంది. Alia Bhatt Marriage.
మరోవైపు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి `రాకీ ఔర్ రానీ కి ప్రేమ్ కహానీ` చిత్రంలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు తను నిర్మాతగా మారి `డార్లింగ్స్` అనే చిత్రంలో నిర్మిస్తూ, మెయిన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తుంది. తెలుగులోనూ ఎన్టీఆర్(NTR)తో `ఎన్టీఆర్ 30`(NTR30)లో నటించాల్సి ఉంది. దీంతోపాటు మరికొన్ని బాలీవుడ్ కమిట్‌మెంట్స్ ఉన్నాయట అలియాకి.
దీంతో ఉన్నట్టుండి ఎన్టీఆర్‌కి షాకిచ్చింది అలియాభట్. ఆయన సినిమాలో నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. మ్యారేజ్ తర్వాత సినిమాల షూటింగ్‌లు ఈజీ కాదు, డేట్స్ క్లాష్ అవుతుంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలో అదే జరిగిందట. దీంతో తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట. ఆ సమాచారం యూనిట్‌కి కూడా అందించిందని సమాచారం.
ఎన్టీఆర్ 30 చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇందులో అలియా భట్‌ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు తప్పుకోవడంతో మరో స్టార్ హీరోయిన్‌ని దించేపనిలో కొరటాల టీమ్ బిజీగా ఉందట. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇది టాలీవుడ్‌లో హాట్ న్యూస్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్, అలియాభట్ `ఆర్‌ఆర్‌ఆర్`లో నటించిన విషయం తెలిసిందే. కాకపోతే అలియాభట్.. రామ్‌చరణ్‌కి జోడీగా నటించింది. తారక్‌కి బ్రిటీష్ నటి ఒలివీయా మోర్రీస్ పెయిర్‌గా చేసింది. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మార్చి 25న విడుదలై సంచలన విజయం సాధించింది. వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది.