- Home
- Entertainment
- Alia,Ranbir Wedding: 5 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలించిందంటూ... పెళ్ళి ఫోటోలు షేర్ చేసిన ఆలియా భట్
Alia,Ranbir Wedding: 5 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలించిందంటూ... పెళ్ళి ఫోటోలు షేర్ చేసిన ఆలియా భట్
ఎట్టకేలకు ఆలియా భట్,రణ్ బీర్ కపూర్ పెళ్లి ఘనంగా జరిగిపోయింది. అత్యంత రహస్యంగా పెళ్లి జరిగినా.. పెళ్లి ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆలియా భట్

ఈరోజు (14 ఏప్రిల్) బాలీవుడ్ లవ్ కపుల్ ఆలియా భట్,రణ్ బీర్ కపూర్ పెళ్ళి వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్ళికి సంబంధించి ఫోటోలు , వీడియోలు బయటకు రాకుండ ముందు చాలా రహస్యంగా ఉంచినా.. ఆలియా భట్ ఈ ఫోటోస్ ను ఈరోజే సోషల్ మీడియాలో శేర్ చేసుకున్నారు.
ఇక ఈ ఫోటోస్ తో పాటు ఓచిన్న నోట్ రాసింది ఆలియా భట్, అత్యంత సన్నిహితమైన బంధువులు, స్నేహితుల మధ్య తమ పెళ్లి జరిగిందని తెలిపింది ఆలియా. దాదాపు 5 ఏళ్ళ తమ స్నేహాన్ని పెళ్లి బంధంతో శాస్వతం చేసుకున్నామంది.
రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. ముందు నుంచీ చెప్పుకున్నట్టు కపూర్ ఫ్యామిలీ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. పెళ్లి ఫోటోలను ఆలియా భట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వీరి పెళ్లి ఫోటోస్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇద్దరు జంట ఎంతో అందంగా.. పెళ్లి డ్రస్సులో క్యూట్ గా కనిపించడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ముచ్చట పడిపోతున్నారు. అంతే కాదు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈజంటను సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.
చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చారు. రెండు మూడు సార్లు పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చేసినా.. కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ముహూర్తం పక్కాగా ఫిక్స్ చేసుకుని ఒక్కటైయ్యారు రణ్ భీర్,ఆలియా భట్.
పెళ్లిలో కార్యక్రమాలలో భాగంగా ముంబైలోని రణ్‌బీర్ నివాసం వాస్తు లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ, సంగీత్ ఈవెంట్ ఘనంగా జరిగాయి. దీనికి బాలీవుడ్ బ్యూటీస్ కరీష్మా కపూర్, కరీనా కపూర్ సహా ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
43 ఏళ్ల క్రితం రణ్‌బీర్ తల్లిదండ్రులు నీతూ కపూర్, రిషి కపూర్‌ల నిశ్చితార్థం జరిగిన రోజునే వీరి మెహందీ వేడుక జరిగింది. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫోటోను నీతూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెళ్ళి వేడుకును కూడా కపూర్ ఫ్యామీలీ దగ్గరుంచి జరిపించారు.
ఇక, రణ్‌బీర్-అలియా పెళ్లి కోసం బాలీవుడ్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది. ఇక అభిమానులైతే వీరి పెళ్ళిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఈ క్రమంలో వీరి పెళి వేడుకు ముగియడంతో ఫ్యాస్ పండగ చేసుకుంటున్నారు. అంతే కాదు ఆలియా భట్ పోస్ట్ పెట్టడంతో పండగచేసుకుంటున్నారు.
అంతే కాదు వీరి పెళ్లి కి సంబంధించిన ఫోటోస్, ఇలా రిలీజ్ అవ్వగానే అలా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పెళ్ళి వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు వచ్చినట్టు తెలుస్తోంది. . పెళ్లి నేపథ్యంలో అభిమానులు కూడా తమ స్టార్స్ కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా పంపుతున్నారు.