- Home
- Entertainment
- Alia Bhatt: ఫస్ట్ టైం బేబీ బంప్ చూపిస్తూ అలియా భట్ ఫోజులు.. మినీ డ్రెస్ లో రచ్చ, పిక్స్ వైరల్
Alia Bhatt: ఫస్ట్ టైం బేబీ బంప్ చూపిస్తూ అలియా భట్ ఫోజులు.. మినీ డ్రెస్ లో రచ్చ, పిక్స్ వైరల్
బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది.
వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలసి నటిస్తున్నారు. అలియా, రణబీర్ ఇద్దరూ బాలీవుడ్ స్టార్ కపుల్స్. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు కనుల పండుగలా ఉంటుంది.
కొన్ని వారల క్రితం అలియా భట్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ తన ప్రెగ్నన్సీ ప్రకటించింది. మరి కొన్ని నెలల్లో అలియా, రణబీర్ కపూర్ దంపతులు తల్లి దండ్రులు కాబోతున్నారు.
అలియా భట్ ఇప్పటి వరకు తన బేబీ బంప్ ని దాచిపెడుతూ వచ్చింది. అందుకు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఫోటో షూట్స్ కి ఫోజులు ఇచ్చింది. కానీ ఎట్టకేలకు అలియా బేబీ బంప్ బయట పెట్టింది.
టైట్ డ్రెస్ ధరించిన బేబీ బంప్ తో ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి. కాఫీ కలర్ మినీ డ్రెస్ లో అలియా భట్ హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. రణబీర్ తో కలసి ప్రస్తుతం అలియా బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.
పాన్ ఇండియా చిత్రం గా రిలీజ్ అవుతున్న బ్రహ్మాస్త్ర చిత్రాన్ని తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి ప్రజెంట్ చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.