- Home
- Entertainment
- Alekhya Reddy : భర్త తారకరత్న ఫొటోకు అలేఖ్యరెడ్డి ముద్దు... కన్నీళ్లు తెప్పించే దృశ్యం
Alekhya Reddy : భర్త తారకరత్న ఫొటోకు అలేఖ్యరెడ్డి ముద్దు... కన్నీళ్లు తెప్పించే దృశ్యం
నందమూరి తారకరత్న (Taraka Ratna) మరణించి ఏడాది గడించింది. ఇవ్వాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా భర్తకు అలేఖ్య రెడ్డి (Alekya Reddy) నివాళి అర్పించిన తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది.

నందమూరి తారకరత్న గుండెపోటు తో గతేడాది ఫిబ్రవరి 18న మరణించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయిన విషయం తెలిపింది. 22 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి మరణించారు.
తారకరత్న మరణించి ఈనెల 18కి ఏడాది గడించింది. ఇక ఇవ్వాళ ఆయన జయంతి. 41వ బర్త్ యానివర్సీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, శ్రేయోభిలాషులు నివాళి అర్పిస్తున్నారు.
ఇక భర్తకు అలేఖ్య రెడ్డి (Alekya Reddy) నివాళి అర్పించిన తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది. భర్త జయంతి సందర్భంగా పూలబొకేను తీసుకొచ్చి నివాళి అర్పించింది. భర్తను ఫొటోలో చూసి మురిసిపోయింది.
గుండెల నిండా బాధతో అలేఖ్య రెడ్డి భర్త జయంతి సందర్భంగా నివాళి అర్పించింది. ఇక ఫొటోలో ఉన్న తారకరత్నకు ముద్దుపెట్టి తన ప్రేమను చాటుకుంది. చిత్రపటాన్ని గుండెకు గట్టిగా హత్తుకుంది.
భర్త లేడనే బాధ తన హృదయాన్ని తొలిచేస్తున్నా.. చిరునవ్వుతో జయంతి సందర్భంగా నివాళి అర్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అలేఖ్య పరిస్థితి కన్నీళ్లు తెప్పించేలా ఉండటంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
అలేఖ్య రెడ్డి తారకరత్నను 2012లో పెళ్లి చేసుకుంది. వీరికి ముగురు సంతానం. పిల్లలు కూడా తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రేమను చూపిస్తూ పలు వీడియోలను పంచుకుంటున్నారు.