MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెత్తగా ఉంది అని ఏఎన్నార్ రిజెక్ట్ చేసిన పాట, చిరంజీవి కెరీర్ లోనే పెద్ద హిట్ అయింది తెలుసా

చెత్తగా ఉంది అని ఏఎన్నార్ రిజెక్ట్ చేసిన పాట, చిరంజీవి కెరీర్ లోనే పెద్ద హిట్ అయింది తెలుసా

చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరొక హీరో దగ్గరకి వెళుతుంది. వేరే హీరోలు చేయాల్సిన కథని దర్శకులు మరో హీరోతో చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కథలు మాత్రమే కాదు పాటలు కూడా ఎక్స్ ఛేంజ్ అవుతుంటాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 09 2025, 08:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
megastar chiranjeevi, Akkineni Nageswara Rao

megastar chiranjeevi, Akkineni Nageswara Rao

చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరొక హీరో దగ్గరకి వెళుతుంది. వేరే హీరోలు చేయాల్సిన కథని దర్శకులు మరో హీరోతో చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కథలు మాత్రమే కాదు పాటలు కూడా ఎక్స్  ఛేంజ్  అవుతుంటాయి. రచయితలు రాసిన లిరిక్స్ బాగాలేకపోయినా, సిచ్యుయేషన్ కి తగ్గట్లుగా లేకపోయినా దర్శకులు, సంగీత దర్శకులు పక్కన పెట్టేస్తుంటారు. వేరే చిత్రాల్లో వాటిని వాడుకుంటుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగేశ్వర రావు మధ్య సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. చిరంజీవికి 90 వ దశకం మహర్దశ అని చెప్పొచ్చు. లెజెండ్రీ లిరిసిస్ట్ వేటూరి సుందరరామ మూర్తి చాలా ఏళ్ళ క్రితమే అక్కినేని నాగేశ్వర రావు చిత్రం కోసం 'అబ్బనీ తీయని దెబ్బ' అనే సాంగ్ రాశారట. ఓ ఇంటర్వ్యూలో అక్కినేని పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ ఈ విషయాన్ని తెలిపారు. 

35

వేటూరి గారి రాసిన లిరిక్స్ అసభ్యంగా ఉన్నాయి, చెత్తగా ఉన్నాయి అని నాన్నగారు రిజెక్ట్ చేశారు. వేటూరి అదే పాటని కొంచెం మార్పులు చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఇళయరాజాకి ఇచ్చారట. ఆ సాంగ్ కి ఇళయరాజా అద్భుతమైన ట్యూన్ కట్టడం జరిగింది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ లో అది కూడా ఒకటిగా నిలిచింది. 

45

ఈ సాంగ్ లో శ్రీదేవి గ్లామర్, చిరంజీవితో ఆమె కలసి నాజూగ్గా వేసిన స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఈ పాటని అద్భుతంగా పాడారు. 

55

నాగార్జున రక్షణ చిత్రంలో సిరివెన్నెల రాసిన నీకు నాకు ఉన్న లింకు అనే పాటని మొదట విలన్ పై చిత్రీకరించాలి అనుకున్నారట. అసలు ఆ పాట వద్దని కొందరు చెప్పడంతో.. ఆ సాంగ్ ని తనకి ఇచ్చేయమని నా చిత్రంలో వాడుకుంటామని రాంగోపాల్ వర్మ అడిగిన సంగతిని కూడా అక్కినేని వెంకట్ గుర్తు చేసుకున్నారు. కానీ చివరికి ఆ పాటని రక్షణ చిత్రంలోనే నాగార్జున, సిల్క్ స్మితపై చిత్రీకరించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Before Stardom:సినిమాల్లోకి రాకముందు ఈ స్టార్లు చేసిన జాబ్స్ ఇవే..ఉద్యోగం వదిలేసి నటులుగా టాప్ పొజిషన్ కి..
Recommended image2
Peddi Controversy: పెద్ది సెట్‌లో జాన్వీకి రాంచరణ్ సపోర్ట్.. కెమెరా యాంగిల్స్ పై అసంతృప్తి, లీకైన చాట్స్?
Recommended image3
Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved