తనకి బాగా ఇష్టమైన ఇద్దరు హీరోయిన్లు ఎవరో చెప్పిన ఏఎన్నార్.. సావిత్రి ఎప్పుడూ బరువు ఎక్కువే అంటూ
ఏఎన్నార్ తో కలసి చాలా మంది హీరోయిన్లు నటించారు. వారిలో తనకి ఇష్టమైన హీరోయిన్లు ఎవరు అనే ప్రశ్నకు ఏఎన్నార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు తన సినీ కెరీర్ లో కళాఖండాలు లాంటి ఎన్నో చిత్రాలు అందించారు. ఎన్టీఆర్ ఒకవైపు, ఏఎన్నార్ మరోవైపు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణిక చిత్రాలు చేస్తుంటే.. ఏఎన్నార్ కూడా పౌరాణికాల్లో నటిస్తూనే ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలతో అలరించారు. అప్పట్లో హీరోయిన్లతో కెమిస్ట్రీ పండించాలంటే ఏఎన్నార్ కి మాత్రమే సాధ్యం అనే ప్రచారం ఉండేది.
ఏఎన్నార్ తో కలసి చాలా మంది హీరోయిన్లు నటించారు. వారిలో తనకి ఇష్టమైన హీరోయిన్లు ఎవరు అనే ప్రశ్నకు ఏఎన్నార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం.. చిన్నప్పటి నుంచి నా ముందే పెరిగిన పిల్ల. అందం, ట్యాలెంట్ రెండూ మెండుగా ఉన్నాయి అంటే అది శ్రీదేవి మాత్రమే అని ఏఎన్నార్ అన్నారు. కానీ శ్రీదేవి నటిగా కంటే ఒక మనిషిగా ఎక్కువ ఇష్టం అని ఏఎన్నార్ అన్నారు.
ఒక నటిగా మాత్రం వాణిశ్రీ అంటే బాగా ఇష్టం అని తెలిపారు. ఈ క్రమంలో సావిత్రి గురించి కూడా చర్చ వచ్చింది. మాయాబజార్ సినిమా టైంలో సావిత్రిపై విమర్శలు, కామెంట్స్ వచ్చాయట. ఇంత లావుగా ఉంది.. ఈమె శశిరేఖ పాత్రకి ఎలా సరిపోతుంది అని అంతా కామెంట్స్ చేశారట. దీని గురించి ఏఎన్నార్ మాట్లాడారు.
ANR
సావిత్రి ఎప్పుడూ లావుగానే ఉండేది. చిన్నప్పుడు దేవదాసు చిత్రంలో తప్ప అని ఏఎన్నార్ అన్నారు. కానీ ఆ ఫీలింగ్ ని సావిత్రి మనసులోకి రానివ్వలేదు. తన లోపం హైలైట్ కాకుండా నటనతో మెప్పించింది. లోపాలు లేకుండా ఎవరు ఉంటారు. తన తెలివితేటలతో మేనేజ్ చేసుకుంది అని ఏఎన్నార్ అన్నారు. ఏఎన్నార్ సావిత్రితో దేవదాసు, మాయాబజార్ లాటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు.
ఇక శ్రీదేవితో ప్రేమాభిషేకం, వాణిశ్రీతో దసరా బుల్లోడు లాంటి చిత్రాలు ఉన్నాయి. దేవదాసు, ప్రేమాభిషేకం ఈ రెండు చిత్రాల్లో ఏ మూవీ ఎక్కువ ఇష్టం అని అడగగా ఏఎన్నార్ సమాధానం ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు కాదు నాకు బాగా ఇష్టమైన చిత్రం బాటసారి అని తెలిపారు.
నాగార్జున, సుమంత్ లలో ఎవరు బాగా ఇష్టం అని అడగగా.. నటుడిగా నాగార్జున అంటే ఇష్టం అని అన్నారు. కానీ సుమంత్ నాగార్జున కంటే అందంగా ఉంటాడు అని తెలిపారు. ఏఎన్నార్ చివరగా మనం చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆయన మరణించిన సంగతి తెలిసిందే.