- Home
- Entertainment
- నేను చెబితే నాన్న కారులో వెళ్లి అడ్వాన్స్ ఇస్తారు, ఆయన తప్పేమి లేదు.. నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు
నేను చెబితే నాన్న కారులో వెళ్లి అడ్వాన్స్ ఇస్తారు, ఆయన తప్పేమి లేదు.. నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు
అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాగ చైతన్య గత కొన్ని రోజులుగా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాగ చైతన్య గత కొన్ని రోజులుగా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. చైతు ఇంటర్వ్యూలలో సినీ విశేషాలు పంచుకుంటూనే తన వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ సంగతుల గురించి ఓపెన్ అవుతున్నాడు.
అక్కినేని కుటుంబానికి గత కొన్నేళ్లుగా సరిగ్గా కలసి రావడం లేదు. అక్కినేని వారి నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అవుతోంది. దీనితో అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలవుతున్నాయి. నాగార్జున అసలు తన వారసుల కెరీర్ పై దృష్టి పెడుతున్నారా అనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు అఖిల్, నాగ చైతన్య సినిమాల విషయంలో నాగార్జున ప్రమేయం ఉంటుంది అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అఖిల్ ఇంతవరకు హిట్ కొట్టలేదు. ఇందులో తప్పెవరిది ? అఖిల్ సొంత నిర్ణయాలా ? లేక నాగార్జున సరైన జడ్జిమెంట్ చేయలేకపోతున్నారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున తలచుకుంటే ఎలాంటి డైరెక్టర్ అని అయినా తన తనయుల కోసం సెట్ చేయవచ్చు.
కానీ అఖిల్, చైతు విషయంలో అది జరగడం లేదు అని చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇదే ప్రశ్న నాగచైతన్యకి ఎదురవగా.. చైతు తన తండ్రికి మద్దతు తెలిపారు. నేను కానీ, అఖిల్ కానీ ఎవరైనా డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉంది అని చెబితే నాన్న వెంటనే కారులో వెళ్లి అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్టు సెట్ చేస్తారు.
మీకు ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందో చెప్పండి అని నాన్న చాలా సార్లు అడిగారు. ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు. కాకపోతే మాకంటూ సొంతంగా ఎక్స్పీరియన్స్ రావాలనే ఉద్దేశంతో మేమే ప్రాజెక్ట్స్ అంగీకరిస్తున్నాము అని చైతు తెలిపారు.
Samantha
ఇటీవల విడుదలైన కస్టడీ ట్రైలర్ సినిమాపై ఉత్కంఠ పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంతో నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటించిన సంగతి తెలిసిందే. కస్టడీ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ బోలెడు ఆశలతో ఉన్నారు.