- Home
- Entertainment
- మళ్ళీ ప్రేమలో పడ్డ నాగచైతన్య... ? క్లారిటీ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో... ఏమన్నాడంటే..?
మళ్ళీ ప్రేమలో పడ్డ నాగచైతన్య... ? క్లారిటీ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో... ఏమన్నాడంటే..?
సైలెంట్ గా కూల్‌గా, కామ్‌గా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటాడు అక్కినేని నాగచైతన్య. అటువంటి నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాడంటే ఎవరికి నమ్మాలి అనిపించలేదు. వీరు విడిపోవడంతో ఫ్యాన్స్ ఎంతో బాధపడ్డారు. ఇక నాగచైతన్య మరో సారి ప్రేమలో పడ్డట్టు తెలుస్తో్ంది. స్వయంగా చై చెసిన కామెంట్స్ తో ఫిక్స్ అవుతున్నారు నెటిజన్లు.

టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అనిపించుకున్నారు నాగచైతన్య సమంత. వీరిద్దరు విడాకులు తీసుకోవడం.. ఇప్పటికీ నమ్మలేని నిజంగానే ఉండిపోయింది. అసలు కూల్‌గా, కామ్‌గా ఉండే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాడంటే ఎవరికీ నమ్మాలనిపించలేదు. ఈ క్యూట్ కపుల్ కలిస్తే చూడాలని ప్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వీరు మళ్లీ కలుసుకుంటే బావుండని కూడా ఆశపడుతున్నారు.
అయితే ఈ విషయంలో ఎవరి దారి వారు చూసుకున్నారు. చూట్టానికి కామ్ గా ఉన్నా.. వీరి మధ్య అగాధం లోతుగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి బెస్ట్ ఉదాహరణగా.. కరణ్ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. చంపుకునేంత కోపం ఉన్నట్టు ఆమె చెప్పకనే చెప్పింది. ఇక వీరు కలవడం జరగని పని అంటున్నారు కొందరు. ఈ క్రమంలో నాగచైతన్య మళ్ళీ ప్రేమలో పడ్డారన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది.
మీరు మళ్లీ ప్రేమలో పడతారా అని నాగచైతన్యకు ప్రశ్న ఎదురయ్యింది. దీనికి చైతూ పాజిటివ్‌గా స్పందించారు.. తప్పకుండా.. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరగనుందో.. మనిషి జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో.. ప్రేమ కూడా అంతే అవసరం.. మనం ప్రేమించాలి. ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి. అలా జరిగితేనే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని చైతన్య వివరించారు.
విడాకులు అనౌన్స్ మెంట్ తరువాత నాగచైతన్యతో పాటు సమంత కూడా ఎక్కడికి వెళ్లినా అవే ప్రశ్నలు.. ఏ సినిమా ప్రమోషన్‌కి వెళ్లినా అవే మాటలు.. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు టీమ్. ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యలో తను మళ్లీ సమంతతో విడాకులపై స్పందించక తప్పలేదు.
చైతూ ఏమన్నాడంటే.. తప్పని పరిస్థితుల్లో విడిపోయాం.. ఇప్పుడు ఎవరి జీవితాలు వారు గడుపుతున్నా మళ్లీ అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. విడాకులు తీసుకున్నప్పటికీ మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. సామ్ చేసే ప్రతి వర్క్‌ని చూస్తూనే ఉంటా. ఆమెను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా. అన్నారు.
అంతే కాదు మేం విడిపోయా నావి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి గురించి చర్చ లేదు కాని.. ఎప్పుడో అనౌన్స్ చేసిన విషయం గురించి అది కూడా.. మా విడాకుల గురించే మాట్లాడుతున్నారు. ఎప్పుడూ ఇవే ప్రశ్నలతో వేధిస్తున్నారు.. దానివల్ల విసిగిపోతున్నా అని నాగచైతన్య అన్నారు. మళ్లీ ఇలాంటి ప్రశ్నలతో వేధించవద్దన్నారు.
సామ్ మాత్రం డిఫరెంట్ గా స్పందించింది. కాఫీ విత్ కరణ్‌లో భవిష్యత్తులో ప్రేమలో పడే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ప్రస్తుతం వర్క్‌ని ప్రేమిస్తున్నా అంది. .. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది బ్యూటీ. ఎవరికి వారు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం నాగచైతన్య, సమంత గురించి వార్తలు మాత్రం వరదల్లా ఆగడం లేదు.