మత్య్సకారులతో నాగచైతన్య.. పాన్ ఇండియా సినిమా కోసం శ్రీకాకుళం గ్రామాల్లో చైతూ, చందూ మొండేటి
నాగచైతన్య 23వ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా మూవీ గురించి చైతూ, చందూ మొండేటి శ్రీకాకుళం గ్రామాల్లో పర్యటించారు.
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) తన నెక్ట్స్ సినిమాను ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని విధాలుగా రెడీ అవుతున్నాడు. ‘కార్తీకేయ 2’తో హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ23వ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయ్యింది. గీతా ఆర్ట్స్ లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. భారీ స్కేల్లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి.
వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఇప్పటికే చైతూ నటించిన ‘థ్యాంక్యూ’, ‘కస్టడి’ వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో నెక్ట్స్ సినిమాతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. NC23ని సీరియస్ గా తీసుకున్నారు. గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తాజాగా అప్డేట్స్ అందించారు. శ్రీకాకుళంలోని ఓ గ్రామంలో నాగ చైతన్య, చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ పర్యటించారు. గార మండలం కె.మచ్చిలేశం గ్రామంలో సినిమా కోసం మత్స్యకారుల కుటుంబాలను కలిశారు.
మత్స్యకారులను, వారి కుటుంబాలను కలిసి భూమి, వారి సంస్కృతి, వారి జీవనశైలిని అర్థం చేసుకున్నాడు. చైతన్య కథలోని పాత్రను పూర్తి అర్థం చేసుకునేందుకు ఇలా మత్స్యకారులను కలిశారు. ప్రస్తుతం NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ ఈ నెలలో షూట్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. నిన్న వైజాగ్‌లో నాగ చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్ కలిసి పర్యటించిన విషక్ష్ం తెలిసిందే. ఈరోజు శ్రీకాకుళంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మీడియాతో చేతూ మాట్లాడుతూ.. ఆరు నెలల కింద చందూ కథ చెప్పాడు. చాలా ఎగ్జైట్ అయ్యాను. యదార్థ సంఘటనల ఆధారంగా కథను డెవలప్ చేశారు. వాస్, చందూ రెండేళ్లుగా కథపై వర్క్ చేస్తున్నారు. కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మత్స్యకారుల జీవనశైలి, వారి బాడీ లాంగ్వేజ్, గ్రామ వాతావరణాన్ని పూర్తి అర్థం చేసుకోవడానికి ఇక్కడి వచ్చామన్నారు. ఇక చందూ మొండేటి కూడా మాట్లాడుతూ.. “కార్తీక్ అనే స్థానిక వ్యక్తి 2018లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా కథను సిద్ధం చేశాడు. మొదట్లో అరవింద్‌గారికి, బన్నీ వాస్‌గారికి కథ చెప్పాడు. కథ వినగానే ఎగ్జైట్ అయ్యాను. రెండేళ్లుగా స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ అయ్యింది. చై కథను ఓకే చేయడంతో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ''మా పని ఇప్పుడే మొదలైంది. 2018లో ఒక సంఘటన జరిగింది. గ్రామంలోని స్థానికులు ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లి అక్కడ ఫిషింగ్ బోట్లలో పని చేస్తున్నారు. 2018లో జరిగిన ఈ సంఘటనపై రచయిత కార్తీక్ కథను డెవలప్ చేశారు. చందూ దానిని ఇష్టపడి అందమైన ప్రేమకథగా రూపొందించారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా నిర్మాతలు కొన్ని రియలిస్టిక్ సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. దర్శకుడు చందూ కూడా కథ జరిగిన మూలాల్లోకి వెళ్లాలనుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీని కదిలించడంతోపాటు పాకిస్థాన్‌లోని కరాచీని కూడా కుదిపేసింది. అందుకే గ్రామాన్ని సందర్శించాలనుకున్నాం. యాథర్థ ఘటనకు లవ్ అండ్ ఎమోషన్స్,, యాక్షన్ ను జోడించి బలమైన కథగా మార్చినట్టు తెలిపారు. భారీ స్థాయిలో రూపొందించనున్నామని అన్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళంలో మత్య్సకారులను `తండెల్` అని పిలుస్తారట. స్థానికంగా పాపులర్ అయినా ఈ పదాన్నే టైటిల్ గా ఫైనల్ చేస్తారని సమాచారం. ఇక చైతూ మత్య్సకారుడిగా కనిపించబోతున్నారని అర్థమవుతోంది. కథ పరంగా చూస్తే.. శ్రీకాకుళంతోపాటు గుజరాత్ నేపథ్యంలోనూ కథ రన్ అవుతుందని, కొన్ని పాకిస్తాన్ బార్డర్లో సాగుతాయని అంటున్నారు.