MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Agent Review:'ఏజెంట్' ప్రీమియర్ టాక్.. వైల్డ్ సాలా నచ్చాడా, కసిగా వచ్చిన అఖిల్ ఈసారైనా హిట్ కొట్టాడా

Agent Review:'ఏజెంట్' ప్రీమియర్ టాక్.. వైల్డ్ సాలా నచ్చాడా, కసిగా వచ్చిన అఖిల్ ఈసారైనా హిట్ కొట్టాడా

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేసిన భారీ ప్రయత్నం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై ఆడియన్స్ మంచి బజ్ ఉంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అన్నంత కసిగా అఖిల్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశాడు అనే చెప్పాలి.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 28 2023, 05:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏది ఏమైనా వైల్డ్ సాలాగా అఖిల్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేందుకు సిల్వర్ స్క్రీన్ పై సందడి మొదలెట్టాడు. ఏజెంట్ ప్రీమియర్ షోల సందడి యుఎస్ లో మొదలైంది. ఈ చిత్రంలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండడం ఒక స్పెషల్ అట్రాక్షన్. మరి ఏజెంట్ ఎలా ఉన్నాడో,ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేసిన భారీ ప్రయత్నం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై ఆడియన్స్ మంచి బజ్ ఉంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అన్నంత కసిగా అఖిల్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశాడు అనే చెప్పాలి. దాదాపు ఏడాది సమయం అఖిల్ ఈ మూవీ కోసం శ్రమించాడు. సురేందర్ రెడ్డి కూడా ఏజెంట్ ని అఖిల్ కి ఒక మెమొరబుల్ మూవీగా మార్చేందుకు స్థాయికి మించిన బడ్జెట్ వెచ్చించారనే ప్రచారం జరిగింది. 

37

ప్రారంభంలోనే చిన్న ట్విస్ట్ తో మమ్ముట్టి పాత్ర పరిచయం అవుతుంది. ఆయన రా (RAW) కోసం పనిచేస్తున్న సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్ రూపంలో మొదలవుతాయి. ఆ తర్వాత సిండికేట్ బాస్ గా డినో మోరే పాత్ర కూడా పరిచయం అవుతుంది. ఆయన కరుడుకట్టిన డాన్ గా కనిపిస్తారు. ఇక అఖిల్ రామకృష్ణ అనే హ్యాకర్ గా క్లాసీ ఎంట్రీ ఇచ్చాడు. 

47

అఖిల్ ఇప్పటి వరకు కనిపించింది ఒకెత్తు.. ఈ చిత్రంలో మరో ఎత్తు అన్న విధంగా పెర్ఫామ్ చేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ కి డిఫెరెంట్ క్యారెక్టరైజేషన్, విభిన్నమైన డైలాగ్ మాడ్యులేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అది 100 శాతం ఫలించిందా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టోరీలో యాక్షన్ మెరుపులు తప్ప ఎగ్జైట్ చేసే అంశాలు తక్కువ. 

 

57

సురేందర్ రెడ్డి చిత్రాల్లో స్క్రిప్ట్ బలంగా లేకున్నా సన్నివేశాలు ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. కానీ ఏజెంట్ ఫస్ట్ హాఫ్ లో అలాంటి సీన్స్ లేవు. పైగా కథ నేరేట్ చేసిన విధానం బలహీనంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. కానీ ఆడియన్స్ కి కథ పూర్తి స్థాయిలో కనెక్ట్ కాకపోవడంతో ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా సాగింది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే కాస్త హై ఇస్తుంది. 

67

హీరోయిన్ సన్నివేశాలు, పాటలు నిరాశపరిచే విధంగా ఉన్నాయి. అఖిల్ వైల్డ్ క్యారెక్టరైజేషన్ యాక్షన్ సన్నివేశాల వరకు ఒకే అనిపించే విధంగా ఉంది. స్క్రీన్ ప్లే వేగంగా సాగినప్పటికీ ఆకట్టుకొని కథతో ఆడియన్స్ కి నిరాశ తప్పదు. ఇక సెకండ్ హాఫ్ లో లో కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. 

77

అఖిల్ చేత బలవంతంగా యాక్షన్ ఫిలిం చేయించారు తప్ప.. సురేందర్ రెడ్డి మార్క్ ఎక్కడా కనిపించడం లేదు. దర్శకుడిగా సురేందర్ రెడ్డి వర్క్ బ్యాక్ ఫైర్ అయింది అనే కామెంట్స్ వస్తున్నాయి. కథ, అఖిల్ క్యారెక్టరైజేషన్ కోసం సురేందర్ రెడ్డి భారీ హంగామా చేసారు కానీ అందంతా రొటీన్ వ్యవహారమే. మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి ఏమాత్రం సహకరించలేదు. క్లైమాక్స్ సన్నివేశాలు మరీ సిల్లీగా ఉన్నాయని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అద్భుతం జరగడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. అఖిల్ కి కోరుకున్న హిట్ ఈసారి కూడా వాయిదా పడ్డట్లే అని ఆడియన్స్ అంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved