- Home
- Entertainment
- బ్లూ డ్రెస్ లో ఐశ్వర్యా రాజేశ్ స్టన్నింగ్ స్టిల్స్.. స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న ట్రెడిషనల్ బ్యూటీ!
బ్లూ డ్రెస్ లో ఐశ్వర్యా రాజేశ్ స్టన్నింగ్ స్టిల్స్.. స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న ట్రెడిషనల్ బ్యూటీ!
డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ నెట్టింట దుమ్ములేపుతోంది. తాజాగా స్టైలిష్ లుక్ లో క్రేజీగా ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.

ట్రెడిషనల్ వేర్స్ బ్యూటీగా ఐశ్వర్య రాజేశ్ కు మంచి పేరుకుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి కేరీర్ లో దూసుకెళ్తూనే.. తన పర్సనల్ ఇమేజ్ ను కూడా పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ అభిమానులకు బాగా దగ్గరైంది.
హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేశ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేండ్లు అవుతోంది. తమిళం, తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ వస్తోంది. పాత్ర నచ్చితే హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటోంది.
ట్రెడిషనల్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ ఇటీవల గ్లామర్ విందులోనూ మతిపోగొడుతోంది. కేవలం ట్రెడిషనల్ వేర్స్ లోనే కాకుండా వెస్ట్రన్ వేర్ లోనూ దర్శనమిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.
తాజాగా ఐశ్వర్యా రాజేశ్ అదిరిపోయేటి బ్లూ డ్రెస్ లో మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. స్టైలిష్ వేర్ లో డస్కీ బ్యూటీ మరింత అట్రాక్ట్ చేస్తుండటంతో పాటు.. ఆమె స్టిల్స్ కూడా కుర్రాళ్ల చూపులను ఆకర్షిస్తున్నాయి. ఐశ్వర్య మత్తు చూపులతోనూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తమిళం, తెలుగు భాషల్లో ఐశ్వర్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే వస్తోంది. హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అభిమానులు, ఫ్యాన్స్ ను అలరిస్తోంది. చివరిగా తెలుగులో ఐశ్వర్య ‘టక్ జగదీష్’,‘రిపబ్లిక్’ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం పదికిపైగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తోంది.
డస్కీ ఐశ్వర్యకు ప్రస్తుతం తమిళంలో భారీ మార్కెట్ ఉంది. దీంతో ఒకసినిమా తర్వాత మరోసినిమాకు సైన్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో మొత్తం 12 సినిమాలు ఉన్నాయి. ఇందులో కొన్ని పూర్తవగా.. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ‘డ్రైవర్ జమున’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.