- Home
- Entertainment
- ప్రభాస్ సినిమా వల్ల నా చిత్రం బలైంది.. చాలా బాధపడ్డా, ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సినిమా వల్ల నా చిత్రం బలైంది.. చాలా బాధపడ్డా, ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్
విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.
తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది.
చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఐశ్వర్య రాజేష్ రీసెంట్ గా నటించిన ఫర్హానా చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను తెలుగు అమ్మాయిని అయినప్పటికీ తెలుగులో అవకాశాలు అంతగా రావడం లేదు అని కుండ బద్దలు కొట్టేసింది.
తాను కౌశల్య కృష్ణమూర్తి చిత్రం కోసం ఫిజికల్ గా ఎంతో శ్రమించానని ఐశ్వర్య రాజేష్ తెలిపింది. తమిళంలో సూపర్ హిట్ ఐంది. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వచ్చింది కానీ.. ఆ నెక్స్ట్ వీక్ ప్రభాస్ సాహో చిత్రం రిలీజ్ కావడంతో మా చిత్రానికి దెబ్బ పడింది. కౌసల్య కృష్ణమూర్తి చిత్రానికి క్రమంగా ఆడియన్స్ పెరుగుతున్న టైంలో అలా జరిగింది. దీనితో చాలా బాధపడ్డా.
ప్రభాస్ లాంటి హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఎందుకు తొందర పడడం.. తర్వాత రిలీజ్ చేద్దాం అని నిర్మాతలకు చెప్పాను కూడా. కానీ వినలేదు అని ఐశ్వర్య రాజేష్ వాపోయింది. కానీ టెలివిజన్ లోకి ఆ చిత్రం వచ్చాక ఆదరణ మరింత పెరిగింది. థియేటర్స్ లో వారంతా చూసి అభినందించినట్లు ఐశ్వర్య పేర్కొంది.