MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భర్తని పక్కన పెట్టి మాజీ ప్రియుడికి క్లోజ్‌గా ఐశ్వర్యా రాయ్‌ పోజులు.. రూమర్లకి అగ్గిరాజేయడం కాకపోతే ఏంటిది?

భర్తని పక్కన పెట్టి మాజీ ప్రియుడికి క్లోజ్‌గా ఐశ్వర్యా రాయ్‌ పోజులు.. రూమర్లకి అగ్గిరాజేయడం కాకపోతే ఏంటిది?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌.. ఇటీవల అంబానీ పెళ్లిలో చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. పెద్ద దుమారం రేపుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 16 2024, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అంబానీ పెళ్లిలో ఆమె వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో గతంలో పలు రూమర్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాటికి బలాన్నిస్తుంది. అంబానీ పెళ్లిలో అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్, అభిషేక్‌ బచ్చన్‌, బిగ్‌ బీ కూతురుతో కలిసి వచ్చారు. ఫోటోలకు పోజులిచ్చారు. 

26

కానీ వీరితోపాటు ఐశ్వర్య రాయ్‌ రాలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె తన కూతురు ఆరాధ్యతో కలిసి అంబానీ పెళ్లిలో పాల్గొంది. ఈ ఇద్దరే ఫోటోలకు పోజులిచ్చారు. హైలైట్ గా నిలిచారు. దీంతో గతంలో ఉన్న రూమర్లు మరోసారి ఊపందుకున్నాయి. ఐష్‌, అభిషేక్‌ బచ్చన్‌ విడిపోతున్నారనే రూమర్లు ఉన్న నేపథ్యంలో అంబానీ పెళ్లిలో జరిగిన సంఘటనలతో ఆ రూమర్లకి మరింత బలం చేకూరినట్టయ్యింది. 
 

36

ఇదిలా ఉంటే ఆ సమయంలోనే ఐష్‌ చేసిన పని మరింత మంట పెడుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ఐశ్వర్య రాయ్‌.. అంబానీ పెళ్లిలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ఫోటో దిగింది. సల్లూభాయ్‌ చేయిని పట్టుకుని ఆమె ఫోటోకి పోజులివ్వడం విశేషం. దీంతో ఈ పిక్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ అగ్గి రాజేసినట్టు అయ్యింది. అసలే ఐష్‌, అభిషేక్‌ విడిపోతున్నారనే రూమర్‌ ఉన్న నేపథ్యంలో ఐష్‌ సల్మాన్‌కి క్లోజ్‌గా ఉండటంతో కొత్త రూమర్లు పుట్టుకొస్తున్నాయి. 
 

46

మాజీ ప్రపంచ సుందరి భర్తని పక్కన పెట్టి మాజీ ప్రియుడికి క్లోజ్‌ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ఐష్‌, సల్మాన్‌ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. ఆతర్వాత బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆయనతోపాటు వివేక్‌ ఒబేరాయ్‌, హృతిక్‌ రోషన్‌తో డేటింగ్‌ రూమర్లు వచ్చాయి. అనంతరం ఐష్‌.. అభిషేక్‌కి దగ్గరయ్యిందనే రూమర్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఐష్‌ సల్మాన్‌కి క్లోజ్‌గా ఉన్న ఫోటో పెద్ద దుమారమే లేపుతుంది. 
 

56

అయితే అంబానీ పెళ్లిలో సల్మాన్‌తో ఐశ్వర్య క్లోజ్‌గా లేదని, అది ఫేక్‌ ఫోటో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కావాలని కొందరు క్రియేట్‌ చేశారని అంటున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దీనికితోడు ఈ పెళ్లిలో అభిషేక్‌, ఐష్‌ పక్క పక్కనే కూర్చున్నారు. కానీ కొంత గ్యాప్‌తో కూర్చున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఏది నిజమో గానీ, ఇప్పుడు ఐష్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. అభిషేక్‌తో విడిపోతుందనే రూమర్‌ పెద్ద రచ్చ చేస్తుంది. 
 

66

 కానీ ఈ ఈవెంట్‌లో ఐష్‌ కూతురు ఆరాధ్య స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. చూడ్డానికి ట్రెడిషన్‌ డ్రెస్‌ వేసినా అందంలో అమ్మనే డామినేట్‌ చేస్తుంది. క్యూట్‌ అందాలతో అందరిని ఆకట్టుకుంది. పెళ్లిలో హైలైట్ అయ్యింది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: తమ్ముడి కవల పిల్లల బర్త్ డే వేడుకలో మహేష్‌ బాబు నమ్రత సందడి.. నయా లుక్‌లో అదరగొడుతున్న ప్రిన్స్
Recommended image2
Vijay Trisha Marriage: ఎన్నికల తర్వాత విజయ్-త్రిష పెళ్లి? హింట్‌ ఇచ్చిన స్టార్‌ హీరోయిన్‌ తల్లి ?
Recommended image3
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో త్రివిక్రమ్ వేలు పెట్టారా ? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇదే..హరీష్ శంకర్ ఓపెన్ గా ఇలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved