ఐశ్వర్య రాయ్ ని మించిన అందంతో ఆరాధ్య, అప్సరసలా అమితాబ్ మనవరాలు ఫోటోలు వైరల్..
ఐశ్వర్య రాయ్ గారాల పట్టి.. బచ్చన్ ఫ్యామిలీ వారసురాలు.. అమితాబ్ ముద్దుల మనవరాలు ఆరాధ్య ను చూశారా..? చిన్నప్పుడు కాదు.. ఇప్పుడు ఆరాధ్య ఎలా ఉందో తెలుసా.. ? చూస్తే షాక్ అవుతారు.

చాలా కాలం తరువాత మీడియా ముందు ప్రత్యక్షం అయ్యింది బచ్చన్ ఫ్యామిలీ వారసురాలు ఆరాధ్య బచ్చన్. ఐశ్వర్య రాయ్ తనయురాలిని చూసి.. అంతా షాక్ అయ్యారు. ఆమె న్యూ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతలా మారిపోయిన ఈ స్టార్ కిడ్.. అంబానీ ఇంట వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ మరియు పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుండి మార్చి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగాయి.ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, రణబీర్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్ తదితరులు హాజరయ్యారు. అలాగే సౌత్ ఇండియా నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఫ్యామిలీతో, టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. వీరితో పాటు పలువురు క్రీడాకారులు, వ్యాపారవేత్తలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
ఆనంద్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ మరియు కుమార్తె ఆరాధ్య. ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య మీడియా కంట పడ్డారు. ఆమె ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
గతేడాది చూసినప్పుడు బాబ్ కటింగ్ హెయిర్ స్టైల్‌తో చాలా చిన్న అమ్మాయిగా కనిపించిన ఆరాధ్య.. ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చేసింది. అదేవిధంగా తల్లి ఐశ్వర్యరాయ్ ని చిన్నప్పుడు చూసినట్టుగా పొడుగ్గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఐశ్వర్యరాయ్‌ని మించిన అందంతో తళుక్కున మెరుస్తోంది బ్యూటీ. ఇక త్వరలో హీరోయిన్ అయ్యే లక్షణాలు గట్టిగా కనిపిస్తున్నాయి అంటున్నారు నెటిజన్లు, అభిమానులు.