ఇక ఆపండి, అతను మీవాడే.. యువ హీరోతో లవ్ అఫైర్ పై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మీ
నిన్నటి నుంచి యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి గురించి ఒక వార్త వైరల్ గా మారింది. యువ హీరో అర్జున్ దాస్ తో ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో పడిందని వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
నిన్నటి నుంచి యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి గురించి ఒక వార్త వైరల్ గా మారింది. యువ హీరో అర్జున్ దాస్ తో ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో పడిందని వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీనికి కారణం ఐశ్వర్య లక్ష్మీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో. అర్జున్ దాస్ తో క్లోజ్ గా ఉంటూ తీసుకున్న సెల్ఫీ పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ కి హార్ట్ ఎమోజి కూడా పోస్ట్ చేయడంతో వీరి మధ్య ప్రేమ చిగురించింది అని అంతా భావించారు. ప్రియాంక జవాల్కర్ కూడా విషెష్ చెబుతూ కామెంట్ పెట్టింది. ఈ పిక్ ఒక రేంజ్ లో వైరల్ కావడం.. అర్జున్ తో తాను రిలేషన్ లో ఉన్నానని ప్రచారం ఎక్కువవడంతో ఐశ్వర్య లక్ష్మి స్పందించింది.
అంతా భావిస్తున్నట్లు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం మేమిద్దరం స్నేహితులం మాత్రమే అని తెలిపింది. నా పోస్ట్ ఈ రేంజ్ లో పేలుతుందని ఊహించలేదు. అనుకోకుండా ఇద్దరం కలిశాం. దీనితో ఫోటో తీసుకుని పోస్ట్ చేశా. మీరనుకుంటున్నట్లుగా ఏమీ లేదు. మేం స్నేహితులం మాత్రమే.
నిన్నటి నుంచి నాకు అర్జున్ దాస్ స్నేహితుల నుంచి, ఫ్యాన్స్ నుంచి మెసేజ్ లు వస్తున్నాయి. ఇక ఆపండి. అతను మీవాడే అని ఐశ్వర్య లక్ష్మీ క్లారిటీ ఇచ్చింది.
ఐశ్వర్య లక్ష్మి పొన్నియన్ సెల్వం చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ బ్యూటీ మంచి అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో గాడ్సే, అమ్ము చిత్రాల్లో మెరిసింది.
ఐశ్వర్య లక్ష్మి వయసు 32 ఏళ్ళు. ఈ హాట్ బ్యూటీ డాక్టర్ వృత్తి నుంచి సినిమాల్లోకి వచ్చింది. ఆమె శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎర్నాకులంలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది.