- Home
- Entertainment
- ‘అన్ స్టాపబుల్ 2’ షోలో ప్రభాస్, గోపీచంద్.. ఇక్కడైనా డార్లింగ్ ఓపెన్ అవుతారా.. స్టైలిష్ లుక్ లో అదిరిన కటౌట్!
‘అన్ స్టాపబుల్ 2’ షోలో ప్రభాస్, గోపీచంద్.. ఇక్కడైనా డార్లింగ్ ఓపెన్ అవుతారా.. స్టైలిష్ లుక్ లో అదిరిన కటౌట్!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సక్సెస్ ఫుల్ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 2కు గెస్ట్ లుగా ప్రభాస్, గోపీచంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డార్లింగ్ లుక్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను ‘ఆహా’ రిలీజ్ చేసింది. దీంతో నెట్టింట వైరల్ గా మారాయి.

బుల్లితెరపై నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) హోస్టింగ్ గా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఫస్ట్ సీజన్ ఊహించని స్థాయిలో విజయవంతం అయ్యింది.
మరింత స్పెషల్ గా రెండో సీజన్ ను కూడా ప్రారంభించారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు. Unstoppable with NBK Season 2లో యంగ్ స్టార్స్ తో పాటు పొలిటికల్ పర్సనాలిటీలనూ ఆహ్వానిస్తూ షోపై మరింత ఆసక్తి పెంచుతున్నారు.
ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరియు యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand)ను గెస్ట్ లుగా హాజరయ్యారు. ఎప్పటి నుంచే వీరిద్దరిని బాలయ్య షోలో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అభిమానుల కోసం మేకర్స్ ఎట్టకేళలకు ఈ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేశారు.
ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ను నిన్న పూర్తి చేశారు. అయితే షో నుంచి ప్రభాస్, గోపీచంద్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానుల కోసం విడుదల చేశారు. డార్లింగ్ ప్రభాస్ న్యూ లుక్ లో అదరగొట్టారు. ఇక బాలయ్య కూడా బ్లూ బ్లేజర్ లో ఎప్పటిలాగే జోష్ గా కనిపించారు.
డార్లింగ్ ను ఎప్పటి నుంచో ఈషోలో చూడాలని ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా షో రన్నర్లు ప్రభాస్ న్యూ లుక్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను విడుదల చేయడంతో ఖుషీ గా అవుతున్నారు. సూపర్ కూల్ గా, స్టైలిష్ గా ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు.
గోపీచంద్, ప్రభాస్ ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. వీరద్దరూ కలిసి ఈ షోకు రావడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభాస్ తన పెళ్లి మేటర్ ను దాటవేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సినీ తారల నుంచి ఆసక్తికరంగా సమాధానాలు రాబడుతున్న బాలయ్య ప్రభాస్ ను పెళ్లిపై ప్రశ్నిస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక్కడైనా డార్లింగ్ ఓపెన్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.