Agnipath Scheme: అగ్నిపథ్ వివాదం... ఉన్మాదం అంటూ ఫైర్ అయిన బిగ్ బాస్ కౌశల్!
దేశంలో అగ్నిపథ్ స్కీమ్ అగ్గి రాజేసింది. దేశ సైన్యంలో చేరాలనుకున్న అభ్యర్థులు, ఔత్సాహికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు విధ్వసం సృష్టించారు. ఈ సంఘటనపై బిగ్ బాస్ కౌశల్ స్పందించారు.

Agnipath scheme
త్రివిధ దళాల్లో సైన్యం నియామకం కొరకు బీజేపీ ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ (Agnipath Scheme) తీసుకొచ్చారు. దీని ప్రకారం అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలా ఎంపిక కాబడిన అభ్యర్థులు నాలుగు సంవత్సరాలు పాటు సైన్యంలో పని చేస్తారు. అనంతరం వారి సేవలు, ప్రతిభ ఆధారంగా సర్వీస్ ఛార్జ్ ఇస్తారు.
ఈ అభ్యర్థుల నుండి కేవలం 25% మాత్రమే ఎంపిక చేస్తారని సమాచారం. మిగతా 70 శాతం అభ్యర్థులు ఉద్యోగం వదిలేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ళ తర్వాత ఇంటికి పంపితే మా పరిస్థితి ఏంటనేది అభ్యర్థుల వాదన. డిఫెన్స్ కెరీర్ గా ఎందుకున్న యువత ఈ అగ్నిపథ్ ఎంపిక విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు.
ఈ విధానాన్ని సమర్ధించే వారు కూడా ఉన్నారు. దేశ భద్రతకు, యువత భవిష్యత్ కి ఇది మేలు చేస్తుందని కొందరు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై నిరసనకారులు దాడి చేశారు. అక్కడ భారీ ఎత్తున ఆస్తిని ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ (Bigg boss Kaushal)స్పందించారు. ఆయన నిరసనకారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అది దేశ ప్రజల సంపద. ఆ నష్టం అంతా మనమే మళ్ళీ టాక్స్ ల రూపంలో చెల్లించాలి. విషయం ఏదైనా ఇంత ఉన్మాదం, ఉక్రోషం పనికిరాదు. శాంతియుత పోరాటం కూడా ప్రభుత్వాన్ని కదిలిస్తుంది, అంటూ కౌశల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
కౌశల్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. కౌశల్ తరచుగా సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. నాని హోస్ట్ గా 2018లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ కౌశల్ గెలిచారు.