అల్ట్రా స్టైలిష్ లుక్ లో సూపర్ హాట్ సమంత.. జీవితంలో అది జరిగాక మొదటిసారి ఇలా!
సమంత హాట్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరు. అయితే కొన్నాళ్లుగా ఆమె ఈ తరహా షూట్స్ చేయడం లేదు. చాలా గ్యాప్ తర్వాత గ్లామరస్ ఫోటో షూట్ ఒకటి చేశారు.
Samantha
సమంత స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమన్. నచ్చినట్లు బ్రతకడమే లైఫ్ అంటుంది. నాగ చైతన్యతో వివాహం అనంతరం కూడా సమంత తన లైఫ్ స్టైల్ మార్చుకోలేదు. బోల్డ్ రోల్స్ లో నటించి షాక్ ఇచ్చింది. ఆన్ స్క్రీన్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్లో ఆమె ధరించిన బట్టలు వివాదాస్పదం అయ్యాయి.
Samantha
బోల్డ్ ఫోటో షూట్స్ చేసేందుకు సమంత అసలు వెనుకాడదు. ఈ మధ్య సమంత వాటికి దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత సమస్యలు అందుకు కారణం. సమంత మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిందే. కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. దీంతో సమంత ఇంటికే పరిమితమయ్యారు. చికిత్స తీసుకుంటూ కెమెరాకు దూరమయ్యారు.
Samantha
ఇటీవల కోలుకున్న సమంత కమ్ బ్యాక్ ఇచ్చారు. ఒప్పుకున్న చిత్ర షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. కాగా చాలా గ్యాప్ తర్వాత సమంత గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. తన లేటెస్ట్ మూవీ శాకుంతలం ప్రమోషన్స్ భాగంగా ఆమె ఈ షూట్ లో పాల్గొన్నారు. ట్రెండీ వేర్ ధరించిన సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ కాకరేపుతుంది. సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సమంత లుక్ అద్భుతం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Samantha
కాగా సమంత అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె పాపులర్ అయ్యారు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నారు. ముంబైలో సమంత ఖరీదైన ఇల్లు కొన్నట్లు సమాచారం. ఏకంగా హైదరాబాద్ నుండి మకాం ముంబైకి మార్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సమంత సిటాడెల్ షూట్లో పాల్గొంటున్నారు. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తుండగా ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
Samantha
సిటాడెల్ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో జరిగింది. అనంతరం నార్త్ ఇండియాలో చిత్రీకరణ జరిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో సిటాడెల్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సిటాడెల్ షూట్ జరపనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సమంత పాల్గొంటున్నారు.